వావ్.. బ్లావ్ కిచెన్ !


Sat,July 28, 2018 12:32 AM

పాతతరం కిచెన్లకు కాలం చెల్లింది. ఆధునిక టెక్నాలజీతో నూతన హంగులతో మార్కెట్లోకి అడుగుపెడుతున్న కిచెన్లు నవ దంపతుల మనసు దోచేస్తున్నాయి. ఇప్పటికే పలు రకాల కిచెన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. విదేశీ పరిజ్ఞానం గల బ్లావ్ కిచెన్స్ వీటిలో కాస్త భిన్నమనే చెప్పాలి.కిచెన్‌లో సాధారణంగా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపేలా, శాస్త్రీయతను జోడించి ఈ కొత్త తరహా వంట గదిని రూపొందించారు. జర్మనీ పరిజ్ఞానం, ఇటలీ డిజైన్‌తో ఇండియాలోకి ఇటీవల ప్రవేశించింది. ఎలివేట్ ఎక్స్ ఈ ట్రాన్స్‌పరెంట్ కిచెన్‌ను మన హైదరాబాద్ వాసులకు పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా యాభై నగరాల్లో ఈ కిచెన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
Elevate-ED
బ్లావ్ మాడ్యులార్ కిచెన్.. కేవలం ఒకే టచ్‌తో తెరుచుకుంటుంది. వంట చేసుకోవడంతో పాటు వస్తువులు, ఆహార పదార్థాలు భద్రపరుచుకునేందుకు డబ్బాలు, డ్రాలు ఇతరత్రా ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కావల్సిన వస్తువులు సరైన సమయంలో కనిపించకపోవడం, వాటిని ఇతర ప్రదేశాలకు కదపడం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి స్వస్తి చెప్పేందుకు నూతన టెక్నాలజీతో బ్లావ్ కిచెన్స్‌ని రూపొందించారు. కేవలం ఒక టచ్‌తోనే డోర్లు తెరుచుకుంటాయి. పారదర్శకంగా ఉన్న ఫర్నీచర్ వల్ల ఎక్కడ ఏ వస్తువు ఉందో తెలుసుకోవడం చాలా సులువు. డైనింగ్ టేబుల్ లేదా మరేదైనా పెద్దగా ఉండాలి.. అప్పుడే ఎక్కువ మంది వినియోగించుకోవచ్చని అందరూ భావిస్తారు. అయితే దాన్ని కదపాలంటే చాలా కష్టపడాలి. బ్లావ్ కిచెన్లలో అలాంటి కష్టమేమి ఉండదు. సులువుగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కదుపవచ్చు. పాలిగ్లాస్ ఫినిషింగ్ అనేది బ్లావ్ కిచెన్‌కు అదనపు హంగులను అద్దుతున్నది. క్యూబ్స్ కాన్సెప్ట్ మొత్తం కిచెన్ డిజైన్ మారిపోతుంది. ఇందులో ఉండే ఫర్నీచర్‌కు ఉన్న కౌంటర్ హ్యాండిల్స్ అత్యంత అనుకూలంగా ఉంటాయి. జారి పడే అవకాశం లేకుండా ఉండేందుకు యాంటీ స్కిడ్ మ్యాట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఉన్న సామగ్రిలోనే నచ్చినట్లుగా విభజన చేసుకొని డ్రాల సంఖ్య పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఇంత సౌకర్యవంతంగా, నూతన సాంకేతికతను కలిగి ఉండటం వల్లే బ్లావ్ కిచెన్లకు మంచి డిమాండ్ ఏర్పడుతున్నది.

409
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles