వారం ముందుగానే..


Wed,December 16, 2015 12:05 AM

hearts


ఈ వారంలో మీకు గుండే నొప్పి రానుందా లేదా కనుక్కునే పరీక్ష త్వరలో అందుబాటులోకి రానుంది. గుండెపోటు వచ్చిన వారి రక్తకణాలను ఆరోగ్యంగా ఉన్నవారితో పోల్చినపుడు చాలా అసాధారణ స్థాయిలో పెద్దవిగా ఉండడాన్ని గమనించారు. ఇలా మారుతున్న రక్త కణాలు రక్తం చిక్కబడటానికి సూచనగా భావిస్తున్నారు. ఛాతిలో నొప్పి అనే సమస్యతో వచ్చిన వారందరికి ఈ రక్తపరీక్ష చేయించడం ద్వారా రెండు మూడు వారాల ముందుగా గుండెపోటు ప్రమాదాన్ని పసిగట్టవచ్చునని నిపుణులు అంటున్నారు. ఇలా ముందుగా పసిగట్టడం వల్ల రక్తాన్ని పలుచగా చేసే మందులు ఇవ్వడం ద్వారా గుండెపోటుని నివారించవచ్చునని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

1662
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles