వాన చుక్కల నుంచి విద్యుచ్ఛక్తి


Mon,August 27, 2018 11:19 PM

వాననీటి చుక్కలతో విద్యుచ్ఛక్తిని తయారు చేసే ఒక కొత్త సాంకేతిక వ్యవస్థను చైనా శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి పరిచారు. దీనితో మనం నిత్యజీవితంలో వినియోగించుకొనే పలు ఎలక్ట్రానిక్ పరికరాలకు చార్జింగ్ చేసుకొనే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు.
Shakti-Sanketikatha
ప్రకృతి పనితనాన్ని, శక్తుల్ని ఉపయోగకరంగా మార్చడంలో మానవుడు ఒక్కొక్క విజయాన్నే నమోదు చేస్తున్నాడు. సంప్రదాయేతర ఇంధన వనరుల్లో ఇక ముందు వర్షం నీరు కూడా చేరనుంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఒక సమర్థవంతమైన కొత్త సాంకేతిక వ్యవస్థను రూపొందించారు. స్వీయ శుద్ధ లేదా ఆవేశిత విద్యుచ్ఛక్తి వ్యవస్థ (SPS- self cleaning/ charging power system)ను బీజింగ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఇటీవల అభివృద్ధి పరిచారు. అడ్వాన్స్‌డ్ ఫంక్షనల్ మెటీరియల్ ఆన్‌లైన్ జర్నల్‌లో ఈ మేరకు వారొక పరిశోధనా వ్యాసం ప్రచురించారు. వానచుక్కల్లోని యాంత్రిక శక్తిని దీనికోసం వారు వినియోగించుకున్నారు. హెచ్- టెంగ్ (H-TENG: hydraulic triboelectric nanogenerator) గా పిలిచే ఈ ఎస్‌పిఎస్ వ్యవస్థ ఎసి కరంటును ఉత్పత్తి చేస్తుంది. దానిని సూపర్ కెపాసిటర్ సాయంతో ఎలక్ట్రానిక్ పరికరాలకు వినియోగించుకొనేలా చేశారు.


Shakti-Sanketikatha2
ఈ వ్యవస్థతో కూడిన పరికరాన్ని మన వెంట తీసుకెళ్లవచ్చు. అంతేకాదు, ఇందులో శక్తిని నిలువ వుంచుకోవచ్చు కూడా. మనం నిత్యజీవితంలో వాడుకొనే వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలకు దీనితో చక్కగా చార్జింగ్ చేసుకోవచ్చునని పరిశోధకులు అంటున్నారు. పై పరిశోధకుల బృందంలో క్యూ ఝాంగ్, క్యూ లియావో, వై ఝాంగ్ ప్రభృతులు ఉన్నారు.

156
Tags

More News

VIRAL NEWS