వానల్లో ఇలా వెళ్లండి!


Thu,July 12, 2018 11:59 PM

మాన్‌సూన్ పర్యాటకం ఇచ్చే మజా ఆస్వాదించే ముందు ఈ సలహాలు పాటించండి. మీ విహారం హాయిగా సాగిపోతుంది.
monsoon
-విహారంలో భాగంగా కొత్త ప్రదేశాలకు వెళ్తుంటాం. అక్కడి నీళ్లు మన ఒంటికి పడుతాయో లేదో తెలియదు. అందుకే ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం మంచిది కాదు. వీలైతే కాచి వడగట్టి తాగండి.
-రెయిన్‌కోట్, గొడుగు అస్సలు మరిచిపోవద్దు. చినుకులు పడుతుంటే ఆ తుంపర్లలో నడిస్తే వచ్చే థ్రిల్ భలే ఉంటుంది. ఆ థ్రిల్‌ను అనుభవించాలంటే రెయిన్‌కోట్, గొడుగు మీకు బాగా సహకరిస్తాయి.
-మీతో పాటు రెప్పలెంట్, ఓడోమస్ లాంటివి దగ్గర ఉంచుకోండి. వర్షాకాలం దోమల బెడద నుంచి తప్పించుకోవాలంటే ఇవే మార్గాలు.
-వేడి వేడిగా నోరూరించే చిరుతిళ్లు మనసును లాగేస్తుంటాయి. ఆ సమయంలో శుభ్రతను గమనించండి. లేదంటే.. అనారోగ్యం పాలు కాక తప్పదు.
-వాతావరణాన్ని బట్టి తిండి, దుస్తులు మారుస్తూ ఉండండి. ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకునే ముందు వాతావరణ సమాచారం తెలుసుకోండి.

650
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles