వాట్సప్!


Tue,July 18, 2017 12:41 AM

ట్వీట్


కోన వెంకట్ @konavenkat99
కోన వెంకట్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య232,917


మొన్న రాత్రి బిగ్‌బాస్ షో చూశాను. చాలా నచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్, అతని ైస్టెల్, టైమింగ్ బాగున్నాయి. అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను.

సమ్‌థింగ్ స్పెషల్


SOMETING-SPL
టాటాను తాజా చేశారు.. దీన్ని కూడా డూప్లికేట్ చేశారు!

కామన్‌మ్యాన్ వాయిస్


జ్యోతిష్యంతో వైద్యమా? బాగుంది. మన రైళ్లను, విమానాలను కూడా తిథి, వార, నక్షత్రాల ప్రకారం నడుపండి చూద్దాం. అట్లనే పక్క దేశపోడు ఎప్పుడు బాంబులేసినా మనం మాత్రం ముహూర్తం ప్రకారమే జవాబిద్దాం.
Mimicry Janardhan


మనకు ఎంత స్థోమత ఉందో ఆ స్థాయిలోనే బతుకాలి కానీ అంతకుమించి ఎక్కువ ఆశ పడకూడదు. అలాగే మనల్ని ప్రేమించే మనిషి ఒక్కసారిగా ఎందుకు మారాడు అని ముందుగా అర్థం చేసుకోవాలి కానీ తొందరపడి అపార్థం చేసుకోకూడదు. మనం అనుకునే అపార్థాల వల్ల కొన్నిసార్లు కొంతమంది మన జీవితం నుంచి శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఒక మనిషి మన పక్కన ఉన్నంతవరకు వాళ్ల విలువ తెలియదు. ఎప్పుడైతే వాళ్లు మనకు దూరం అవుతారో అప్పుడే తెలుస్తుంది. తొందరపడి ఎప్పుడూ ఎవ్వరినీ దూరం చేసుకోకండి.
Thirupathi Bandari

వైరల్ వీడియోమోదీ ఎన్ని మార్పులు తీసుకొచ్చారు. ఇంకెన్ని మార్పులు తీసుకురానున్నారు. ఇలాంటి విషయాల మీద సెటైరికల్‌గా వైవా ఓ వీడియో చిత్రీకరించింది. ఈ వీడియోను యూట్యూబ్‌లో ఎక్కువమంది చూస్తున్నారు.
Whats Next, Modi? | VIVATotal views : 728,837+Published on Jul 14, 2017

షేరింగ్


ప్రలోభం
ఒక ఊళ్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఉండేవాడు. చాలా చక్కని వాక్ పటిమ గలవాడు. ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ ఉంటే వేలమంది వినేవారు. ఆయన గురించి చుట్టుపక్కల గ్రామాల్లోనూ తెలిసింది. ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్లవలసి వచ్చింది. ఆ ఊరెళ్లే బస్సెక్కి టికెట్ తీసుకున్నాడు. పొరపాటున బస్సు కండక్టర్ పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు. కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండడంతో దిగేటప్పుడు ఇద్దాంలే అనుకొని కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతని మనసులో ఆలోచనలు మారాయి. ఆ కండక్టరు కూడా ఎంతోమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు. ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా! ఎంతమంది తినడం లేదు? ఈ పది రూపాయాలు ఏదైనా దైవ కార్యానికి ఉపయోగిస్తా అని అనుకొని మౌనంగా కూర్చున్నాడు. అంతలో ఊరొచ్చింది. బస్సు ఆగింది. కానీ ఆయన దిగేటప్పుడు తన ప్రమేయం లేకుండానే అసంకల్పితంగా కండక్టరుకు పది రూపాయలు ఇచ్చి మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవి ఎక్కువగా ఇచ్చారు అన్నాడు. దానికి ఆ కండక్టర్ అయ్యా! నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను అని అన్నాడు. పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను. నా అదృష్టం బాగుంది. నా మనస్సాక్షి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని నా విలువలు కాపాడింది అనుకున్నాడు.
జీవితకాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావడానికి ఒక్క క్షణం చాలు.
-ఓ వాట్సప్ మెసేజ్

433
Tags

More News

VIRAL NEWS