వాట్సప్!

Tue,March 21, 2017 01:52 AM

ట్వీట్


కరణ్ జోహార్ @karanjohar


కరణ్ జోహార్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య10,273,102
ఇంటర్నెట్‌ను బద్దలు కొట్టింది!

సమ్‌థింగ్ స్పెషల్


someting-spl
కుక్క కోలా!

షేరింగ్


ఆకాశవాణి.. వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ
తరువాత వచ్చే పాటకోసం ఇష్టం లేకపోయినా వార్తలు వినేవాళ్లం. అమ్మా తినటానికి ఏదైనా పెట్టవే.. అని మన చెవుల్ని రేడియోకి అతికించే వాళ్లం. పాటలకోసం! సాయంత్రం చల్లని గాలికి ఈ రేడియోలో పాత పాటలు వింటుంటే ఎంత హాయిగా ఉండేది? ఆ రోజుల్లో మేం స్కూలుకు వెళ్లేటప్పుడు ఒక వ్యక్తి అట్లాస్ సైకిలెక్కి, దసరాబుల్లోడి పంచె కట్టుకుని సైకిల్ ముందున్న బుట్టలో ఒక రేడియో పెట్టుకుని, ఊరంతా వినబడేలా సౌండ్ పెట్టుకుని ఎప్పుడూ మాకెదురొచ్చేవాడు. అతన్ని చూసి మేం టైం చెప్పేంతగా ఉండేది అతని టైమింగ్. అతనికి ఒక గొడుగు కూడా ఉండేది. అతను వాడిన అత్తరు వాసన నాకింకా గుర్తే.. అతనలా ఎందుకు తిరిగేవాడో నాకిప్పటికీ తెలీదు. ఆ రోజుల్లో ఈ రేడియోలు ఒక స్టేటస్ సింబల్ అనుకుంటా బహుశా.. నెమ్మదిగా టేప్ రికార్డర్ వచ్చి రేడియో తాలుకూ జ్ఞాపకాలను కబ్జా చేసి పడేసింది.

ఇంట్లో టేప్ సెట్(మేం అలాగే పిలిచేవాళ్లం) ఉందంటే పదిళ్లకు వినిపించేలా ఉండేది ఆ చప్పుడు. కొత్తపాటలు ఎవడు ముందు వినిపిస్తే వాడే గొప్పోడు మా ఊళ్లో.. మా పెద్దేవంలో చిన్న చెరువుని ఆనుకుని కొన్ని ఇండ్లుండేవి. ప్రతీ ఇంట్లోనూ కంపల్సరీగా ఓ టేప్ సెట్ ఉండేది. అప్పట్లో సినిమా కథలు కూడా క్యాసెట్ల రూపంలో వచ్చేవి. దాంతో ఎవరికి వారు తలో సినిమా పెట్టేసేవారు. ఇక ఆ రోడ్డేంట నడిచేవారికి నరకమే.. నాకైతే అవి వినీవినీ అత్తకు యముడు అమ్మాయికి మొగుడులాంటి చాలా సినిమాల డైలాగులు కంఠస్థ వచ్చేసేవి. తర్వాత నా ప్రస్థానం మా కమల్ టైలర్ గాడి కొట్లో. కొత్త సినిమా పాటలు వినాలంటే మాకదే వేదిక. మా టైలర్‌కి బట్టలు కుట్టడంలో ఉన్న శ్రద్ధకంటే జనానికి పాటలు వినిపించడంలోనే ఎక్కువ మక్కువ ఉండేది. ఇంకా చాలా ఉన్నాయండీ ఆనాటి జ్ఞాపకాలు చెప్పుకొంటూ పోతే.. అలా కాలక్రమేణా టీవీ, సెల్‌ఫోన్లు వచ్చి మనల్ని పాడుచేసి పడేశాయి.

అసలు నా బాధంతా ఇదే.. ఈ సెల్‌ఫోన్ తెచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. చూసారూ.. పాతతరం వస్తువుల ఉనికిని పాడుచేసింది. తరతరాలుగా తమ ఉనికిని కాపాడుకుంటూ వచ్చిన వస్తువులు ఇప్పుడు ఇదే సెల్‌ఫోన్లతో సహజీవనం సాగిస్తున్నాయి. టేబుల్ మీద కూర్చొని పాటలు, తరతరాలుగా ఎన్నో ముచ్చట్లను అందించిన రేడియో, గూట్లో దాక్కుని గొంతెత్తి మనకిష్టమైన మధుర స్వరాలందించిన టేప్‌సెట్, ఇలా ఒకటేమిటి.. క్షేమ సమాచారాన్ని అందించిన ఉత్తరం, చీకటిని చీల్చి దారి చూపించే టార్చిలైటు, పదిలంగా దాచుకునే మన ఫొటో ఆల్బమ్ ఇలా ఎన్నని చెప్పను. అన్నింటినీ మడతపెట్టి మాయ చేసిందీ మాయదారి మొబైల్ ఫోన్.
-గరగ త్రినాధరావు

వైరల్ వీడియోపవన్ కల్యాణ్ కాటమరాయుడుగా వస్తున్నాడు. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఉన్న కాటమరాయుడు ట్రైలర్ విడుదలైంది.
Katamarayudu Official Trailer | Pawan Kalyan | Shruti Haasan | Kishore Kumar Pardasani
Total views : 2,889,341+Published on Mar 18, 2017

778
Tags

More News

మరిన్ని వార్తలు...