వాట్సప్‌లో కొత్తగా ఆరు ఫీచర్లు!


Tue,July 24, 2018 11:34 PM

ఫేక్‌న్యూస్‌తో ఈ మధ్య వదంతులు విస్తరించి అనేక ఉదంతాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అలాంటి సంఘటనలు మళ్లీ జరుగకుండా వాట్సప్ ఆరు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. అవే ఇవి..
whatsapp

వాట్సప్ ఫార్వర్డ్ లేబుల్

మన దేశంలో ఫార్వర్డ్ మెసేజ్‌ల వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్నది. దీని వల్ల ఒక విషయం వాస్తవమా? కాదా? అనే విషయం గురించి ఏ మాత్రం ఆలోచించకుండా దాన్ని గ్రూపుల్లో, పర్సనల్ చాట్స్‌లో షేర్ చేస్తున్నారు. ఇలా షేర్ అయ్యే తప్పుడు సమాచారాన్ని నిరోధించేందుకు వాట్సప్ ఫార్వర్డ్ లేబుల్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నది. దీని ద్వారా అది ఫార్వర్డ్ మెసేజ్ అనే విషయం తెలిసిపోతుంది.


మ్యూట్, మార్క్ ఆస్ రీడ్

వాట్సప్ నోటిఫికేషన్ బార్‌లో రెండు షార్ట్‌కట్స్ రానున్నాయి. ఒకటేమో మెసేజ్ ఓపెన్ చేసి చదివేందుకు కాగా, మరొకటి మ్యూట్‌లో పెట్టుకునేందుకు. రోజుకు యాభై మెసేజ్‌ల పైన వస్తే ఈ ఫీచర్లు ఉపయోగపడుతాయి.


వాట్సప్ స్టిక్కర్స్

ప్రస్తుతం వాట్సప్ ఆండ్రాయిడ్ బెటా వర్షన్ 2.18.218లో ఈ స్టిక్కర్స్ అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఈ స్టిక్కర్స్ అందరికీ అందుబాటులోకి రానున్నాయి.


లింక్ డిటెక్షన్

వాట్సప్ బేటా ఇన్ఫో రిపోర్టు ప్రకారం ఫేక్‌న్యూస్‌కి సంబంధించిన లింకులు ఓపెన్ కాకముందే గుర్తించి అరికట్టేలా ఈ ఫీచర్ ఉపయోగపడనున్నది. వచ్చిన లింక్ ఫేక్ అయితే.. రెడ్‌సిగ్నల్ రూపంలో ఎర్రర్ అని చూపిస్తుంది.


సెండ్ మెసేజ్

ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గ్రూపులలో ఎవరు పడితే వారు పోస్టులు చేయడానికి అవకాశం ఉండదు. గ్రూప్‌లోకి వచ్చిన ఒక మెసేజ్ గానీ, పోస్ట్ గానీ ఆ గ్రూప్‌కి సంబంధించిన అడ్మిన్ అప్రూవ్ చేస్తేనే వాట్సప్ గ్రూప్‌లో పబ్లిష్ అవుతుంది.


మీడియా విజబులిటీ

వాట్సప్‌లో వచ్చిన ఫొటోలు, వీడియోలు ఇతరులకు కనిపించకుండా హైడ్ చేసుకునే సదుపాయం ఈ ఫీచర్ కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం 2.18.194 వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. డిఫాల్ట్, ఎస్, నో అనే ఆప్షన్లను సెలక్ట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను పొందవచ్చు.

372
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles