వర్షాకాలంలో జుట్టు రాలుతున్నదా?


Sun,August 26, 2018 11:07 PM

సమ్మర్ తర్వాత వచ్చే వర్షంలో తడువాలని మహిళలు, ప్రత్యేకించి యువతులు కోరుకుంటారు. అయితే, వర్షం అంటే ఎంత ఇష్టమున్నా జుట్టు విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా తరచూ వర్షంలో తడిసే అమ్మాయిలు జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.
Hair-Tips
-వర్షాకాలంలో రోజూ తలంటు స్నానం చేయాలి. లేదంటే తేమ వల్ల మీ జుట్టు జిడ్డుబారిపోతుంది. దీని వల్ల కుదుళ్లు బలహీనంగా అవుతాయి.
-తలస్నానం చేసేటప్పుడు యాంటీ-బాక్టీరియల్ షాంపూలు, క్లీనర్లు వాడాలి. ఫంగల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి.
-వర్షపు నీటిలో దుమ్ము ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి రక్షణ పొందాలంటే లీవ్ ప్రొడక్ట్స్ వాడాలి. ఇవి జుట్టుపై రక్షణాత్మకమైన పొరను ఏర్పరుస్తాయి. వర్షపు నీటి వల్ల జుట్టు రాలిపోకుండా కాపాడతాయి.
-జుట్టు తడిగా ఉన్నప్పుడు జడ లేదా ముడి వేసుకోకండి. దీని వల్ల జుట్టు పాడవడమే కాకుండా దుర్వాసన కూడా వేస్తుంది.
-ఒకవేళ మీ జట్టు తడిస్తే, టవల్‌తో రుద్ది రుద్ది తుడవకండి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలిపోతుంది. దీనికి బదులు టవల్‌ను మీ జుట్టుకు చుట్టిపెట్టండి. నీరు మొత్తం పోయే వరకూ టవల్‌తో పిండండి.

628
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles