వయసు అభ్యంతరమవుతుందా?


Mon,April 10, 2017 02:04 AM

mother
నా వయసు 39 సంవత్సరాలు. మా వారి వయసు 45 సంవత్సరాలు. మాకు పెళ్లయి పది సంవత్సరాలు అవుతోంది. ఇంత వరకూ పిల్లలు కలుగలేదు. ఆరు సంవత్సరాల క్రితం పరీక్షలు చేయించుకున్నాం. ఎలాంటి సమస్య లేదని చెప్పారు. కానీ ఇంత వరకు మాకు పిల్లలు కలుగలేదు. మరొక్కసారి పిల్లల కోసం ప్రయత్నించాలని అనుకుంటున్నాం. ఈ వయసులో మాకు పిల్లలు కలిగే అవకాశం ఉందా? ఉంటే దయచేసి వివరాలు తెలియజేయగలరు?
విజయలక్ష్మి, వికారాబాద్

మీరు గర్భందాల్చడానికి అవకాశం ఉంది. కానీ అది చాలా తక్కువ అనే చెప్పాలి. పిల్లలు కలిగే అవకాశం పెరిగే వయసుతో పాటు తగ్గుతూ ఉంటుంది. 37 సంవత్సరాల వయసు దాటిన వారిలో చికిత్స ప్రారంభించినప్పటికీ గర్భం దాల్చే అవకాశం కేవలం 15-20 శాతం మాత్రమే. ఇందుకు ప్రధాన కారణం వారిలో అండాల సంఖ్య మరియు నాణ్యత తగ్గిపోవడమే. అదీ కాకుండా పుట్టబోయే పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు రావచ్చు కూడా. అయితే వీటిని గర్భస్థ కాలంలో చాలా ముందుగానే గుర్తించడం సాధ్యపడుతుంది.
PRETHIREDDY
మీకు సంతానసాఫల్యానికి సంబంధించిన పూర్తి పరీక్షలు మరొక్కసారి నిర్వహించాల్సి ఉంటుంది. పరీక్షల ఫలితాలను బట్టి మీకు ఎలాంటి సంతాన సాఫల్య విధానాలను ఆనుసరించాలనేది ఆధారపడి ఉంటుంది. ఐవీఎఫ్ చాలా మంచి చికిత్సా విధానం. మీ అండాల స్థితిగతులు సరిగ్గా లేనపుడు మీరు అండాన్ని దాత నుంచి కూడా స్వీకరించవచ్చు. మీరు మరొక్కసారి తప్పకుండా ప్రయత్నించవచ్చు.

806
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles