వడదెబ్బ తగిలిందా? !

Thu,April 20, 2017 11:37 PM

ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వాతావరణ ప్రభావానికి తట్టుకోవడం ఎవరివల్లా కావడం లేదు. వడగాడ్పులకు జనాలు అతలాకుతలం అవుతున్నారు. ఉపశమనం కోసం చల్లని పానీయాలు తీసుకుంటారు చాలామంది. అయినా విపరీతమైన ఎండల వల్ల వడదెబ్బ తగిలి ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి రోజూ ఎండలో తిరిగేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
Sunstroke
-ఏది పడితే అది తినకుండా.. తాగకుండా పుచ్చకాయ వంటివి తీసుకోవాలి.
-ఎండల వల్ల వడదెబ్బ తగిలితే పుచ్చకాయ, స్ట్రాబెర్రీ జ్యూస్ తాగితే త్వరగా తేరుకోవచ్చు.
-శరీరంలో నీటి సమతుల్యత కాపాడుకోవడం.. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.
-ఎండలో బయటకు వెళ్లేవాళ్లు టోపీలు, స్కార్ఫ్‌లు ధరించాలి.
-ప్రతి అర్థగంటకు మూడు వందల మిల్లీలీటర్ల చొప్పున ఐదారు లీటర్లు తగ్గకుండా నీరు తాగాలి.
-ఓఆర్‌ఎస్ ద్రావణం, నీళ్లు, కొబ్బరికాయ, గ్లూకోజ్ వాటర్ తీసుకోవడం మంచిది.
-ఆటలపై ఆసక్తి ఉన్నవాళ్లు సాయంత్ర సమయాల్లోనే ఆడటం ఉత్తమం.
-వడదెబ్బ తగిలిన వ్యక్తిని గుర్తించి వెంటనే నీడలో సేదతీరేలా చేయాలి.
-బట్టలు వదులు చేసి నీళ్లతో తడపాలి. దీనివల్ల రక్తనాళాలు కుంచించుకుపోకుండా కాపాడగలం.

-మెడపై.. గజ్జల్లో. ఐస్‌ప్యాక్‌లు పెట్టాలి.
-వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
-ఇంటి కిటికీలను తెరచి గాలి.. వెలుతురు వచ్చేలా చూసుకోవాలి.
-శరీర లవణాలు కోల్పోకుండా ఉండాలంటే ఉప్పు వేసిన ద్రవాలు తీసుకోవాలి.
-వెడల్పు అద్దాలున్న కూలింగ్ గ్లాస్ ధరించడం ఉత్తమమంటున్నారు ఆరోగ్యం.. ఫిట్‌నెస్ నిపులు.

542
Tags

More News