వందేండ్ల వయసులో వారెవ్వా!


Fri,December 14, 2018 12:45 AM

102 యేండ్ల వయసు. కాటికి కాళ్లు చాపిన వయోవృద్ధురాలు. బట్ ఈ బామ్మ ఏం చేస్తున్నదో తెలుసా? సాహసాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నది.
Oldest-Skydiver
మూడు తరాలను చూసింది. మహిళగా అన్ని బాధ్యతలనూ నిర్వర్తించింది. కష్టాలను ఎదుర్కొన్నది. సుఖాలను భరించింది. ప్రశాంతంగా దేవుళ్ల నామస్మరణ చేస్తూ కాలం గడిపే వయసులో ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేస్తున్నది. పేరు ఇరేనే ఓషే. ఆస్ట్రేలియాకు చెందిన మహిళ. సముద్ర మట్టానికి 14000 అడుగుల ఎత్తులో స్కైడైవ్ చేసి రికార్డుల్లోకెక్కింది. వందేండ్లు దాటిన తర్వాత ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి సాహసం ఎవరూ చేయలేరు. పదేండ్ల క్రితం ఇరేనే కూతురు న్యూరాన్ వ్యాధితో మరణించింది. ఆ వ్యాధితో మరెవరూ మరణించకూడదని అవగాహన కల్పించాలనుకున్నది. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొని నిధులు సేకరించాలనుకున్నది. సేకరించిన నిధులతో ప్రచారం చేయాలనుకున్నది. స్కైడైవ్ శిక్షకుడు స్మిత్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నది. స్మిత్ సహకారంతో స్కైడైవ్ చేస్తున్న వీడియోను విడుదల చేశారు. ఇరేనే స్కైడైవ్ చేసిన తర్వాత ఆత్మీయంగా మనవలు, మనవరాళ్లు ఆలింగనం చేసుకున్నారు.

506
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles