వందమందిలో ఓ లేడీ టైలర్!


Fri,November 30, 2018 11:25 PM

ఈ ఓ సాధారణ టైలర్. చిన్నప్పటి నుంచి తల్లి అనుభవిస్తున్న గృహహింసను కళ్లారా చూసింది. ఇళ్లలో పాచి పనులు చేసేవారు ఎదుర్కొంటున్న వేధింపులూ చూసింది. యుక్త వయసు నుంచే స్త్రీల హక్కుల కోసం పోరాటం మొదలు పెట్టింది.

vijji
ఈ యేడాది స్త్రీ హక్కులు, సమస్యలపై పోరాడిన వంద మంది ఇన్‌స్పైర్డ్ ఉమెన్ జాబితాను బీబీసీ విడుదల చేసింది. ఆ జాబితాలో మన దేశానికి చెందిన ముగ్గురు మహిళలు ఉన్నారు. వారిలో ఒకరు కేరళ రాష్ర్టానికి చెందిన పి.విజ్జి. పెన్‌కూటు ప్రాంతానికి చెందిన విజ్జి ఓ టైలర్. చిన్నప్పటి నుంచి పేదరికాన్ని అనుభవించిన విజ్జి.. టైలరింగ్ నేర్చుకొని కుటుంబ భారాన్ని మోసింది. తన చిన్నప్పటి నుంచి ఎన్నో సమస్యలు, సంఘర్షణల నడుమ పెరిగింది విజ్జి. 50 యేండ్ల వయసులోనూ ఇప్పటికీ అలుపెరుగకుండా స్త్రీల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తూనే ఉన్నది. తాజాగా రైట్ టూ సిట్ పోరాటాన్ని ముందుండి నడిపించినది.మహిళలు పనిచేసే ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్లు కావాలని, దుకాణాలు, మాల్స్‌లో కాసేపు విశ్రాంతి తీసుకొనేందుకు సమయం ఉండాలంటూ 2009 నుంచి పోరాటం చేస్తున్నది. ఎంతోమందిని ఒకచోటికి చేర్చి.. హక్కుల సాధన కోసం నిరంతరంగా కృషి చేస్తున్నది. ఇందుకు ప్రత్యేకంగా ఓ యూనియన్‌ను ఏర్పాటు చేసింది. 2016లో ఈ యూనియన్ రిజిస్ట్రేషన్‌కు కేరళ గవర్నర్ అనుమతి కూడా లభించింది. దీంతో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పలువురు పురుషులు ఈ యూనియన్‌లో చేరి, సభ్యత్వం తీసుకున్నారు. ఇలా మహిళ సమస్యల కోసం పోరాడుతూ..విజ్జి బీబీసీ ఇన్‌స్పైర్డ్ ఉమెన్ -2018లో స్థానం సంపాదించింది.

872
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles