వండర్ గాళ్ ఆఫ్ ఇండియా!


Sun,August 12, 2018 11:32 PM

తెలివి ఎవరి సొత్తూ కాదు! బాగు పడాలని ఆలోచన, బంగారు భవిష్యత్తు కావాలనే తపన, వాటిని ఆచరణలో పెట్టే కార్యసిద్ధి ఉంటే.. ఎవరైనా విజయం సాధిస్తారని ఈ టీనేజర్ నిరూపిస్తున్నది. 14 యేండ్లకే డిగ్రీ సెకండియర్ చదువుతూ, ఐఏఎస్, ఐపీఎస్ అభ్యర్థులకు, పలువురు అధికారులకు, పలు సంస్థల ఉద్యోగులకు మోటివేషన్ తరగతులను నిర్వహిస్తున్నది.
Dr-Varsha-Puranik
మీరు చదివింది నిజమే...ఈ హర్యానా టీనేజర్.. 11 యేండ్లకే 8 భాషలపై పట్టు సాధించి, 8వ తరగతి చదువాల్సిన వయసులోనే డిగ్రీ సెకండియర్ చదువుతూ.. బీబీసీ న్యూస్ చానెల్‌లో యాంకర్‌గా కనిపించాలనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నది. ఈ చిచ్చర పిడుగు పేరు జాన్హవి. తొమ్మిది సంవత్సరాలకే వండర్ గాళ్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నది. హర్యానాలోని మాల్‌పూర్ గ్రామానికి చెందిన బ్రిజ్‌మోహన్ కుమార్తె జాన్హవి పన్వార్. బ్రిజ్‌మోహన్ గవర్నమెంట్ స్కూల్‌లో పనిచేస్తుండేవాడు. జాన్హవి తెలివితేటలను గమనించిన తండ్రి.. చిన్నప్పటి నుంచే ఆమె ప్రతిభకు సానపెట్టడం మొదలుపెట్టాడు. ఆమె తెలివితేటలు చూసిన స్కూల్ మేనేజ్‌మెంట్ నర్సరీ చదవకుండానే మొదటి తరగతిలో ప్రవేశం కల్పించారు. అలా చిన్నప్పటి నుంచి ప్రతి విషయంపైనా అవగాహన పెంచుకొని, చాలా స్పష్టంగా, అనర్గళంగా మాట్లాడేది. టీవీల్లో వచ్చే న్యూస్ కార్యక్రమాలు చూసి, న్యూస్ యాంకర్లను అనుకరించేది. స్కూల్లో ఉన్నప్పుడు ఉపాధ్యాయులతో హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడేది. హర్యానా చూడడానికి వచ్చిన పర్యాటకుల నుంచి పలు భాషలు నేర్చుకున్నది. ఆ తర్వాత రేఖారాజ్ దగ్గర శిక్షణ తీసుకొని.. ఫ్రెంచ్, జపనీస్, హిందీ, హర్యానా(స్థానిక), బ్రిటిష్, అమెరికన్, స్కాటిష్, ఆస్ట్రేలియన్ ఇలా మొత్తం ఎనిమిది భాషలను 11 యేండ్లకే అనర్గళంగా మాట్లాడుతుంది. భగవద్గీతను కూడా చిన్నప్పుడే చదివేసింది. న్యూస్ యాంకర్ అవ్వాలనే కోరికతో మాస్ కమ్యునికేషన్ చేస్తున్నది. ఇలా ప్రతి విషయంలోనూ తన దైన ప్రతిభను కనపరుస్తూ.. మోటివేషన్ క్లాస్‌లు చెబుతూ ఎందరికో స్ఫూర్తి నింపుతున్నది. పిల్లలకు ఏది కావాలో, తల్లిదండ్రులు ప్రేమతో అర్థం చేసుకుంటే పిల్లలు తమ భవిష్యత్‌ను వారే నిర్మించుకుంటారని చెబుతున్నాడు బ్రిజేష్‌మోహన్.

444
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles