వంటింటి విషయాలు


Sat,August 25, 2018 01:27 AM

ఇంట్లో వంట, బయట ఉద్యోగం వంటి పనులు చేస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. వంటింట్లో కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మీ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. దీంతోపాటు శ్రమ తగ్గి చలాకీగానూ ఉంటారు.
కొన్నిసార్లు మంట ఎక్కువ అవ్వడం వల్ల కూర మాడిపోతుంది. గ్రేవీలో కొంచెం పీనట్ బటర్ వేస్తే మాడిన వాసన చిటికెలో మాయం అవుతుంది. కూర మాడినట్టు ఎవరూ గుర్తించలేరు.

home-tips
-ఇంట్లో కోడిగుడ్లు బాగున్నాయో, పాడయ్యాయో తెలుసుకోవడానికి ముందుగా గ్లాసు నీటిలో కోడిగుడ్డును వేయాలి. పూర్తిగా మునిగితే తాజాగా ఉన్నట్లు పరిగణించవచ్చు. సగం మునిగితే వెంటనే వినియోగించాలి. పూర్తిగా తేలుతున్న గుడ్డును కుళ్లిపోయినట్లు గుర్తించాలి.
-విద్యుత్ కొరత కారణంగా ఫ్రిడ్జ్‌లో ఉన్న కూరగాయలు తొందరగా పాడవుతుంటాయి. అలాంటప్పుడు న్యూస్ పేపర్, టిష్యూను కూరగాయల ట్రే కింద పరచడం వల్ల అధిక తేమను పీల్చేస్తాయి. అప్పుడప్పుడు పేపర్‌ను మారుస్తుండాలి.
-వానకాలం, వాతావరణంలో ఎక్కువగా తేమ ఉన్నప్పుడు ఇంట్లో ఉండే ఉప్పు తడిసి ముద్దవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఉప్పు డబ్బాలో కొంచెం బియ్యం వేస్తే అదనపు తేమను గ్రహించి ముద్ద కాకుండా చేస్తుంది.
-ఆహార పదార్థాలు నిల్వ ఉంచిన డబ్బాలను మరలా ఉపయోగించినప్పుడు మునుపటి ధాన్యాల వాసనను కలిగిఉంటాయి. ఒకసారి వాడిన తరువాత డబ్బాలో న్యూస్ పేపర్‌ను ఉంచి మూత పెట్టాలి. మరలా వాడుకొనే ముందు నీటితో శుభ్రపరిస్తే ఎటువంటి వాసన రాకుండా ఉంటుంది.

521
Tags

More News

VIRAL NEWS