వంటింటి చిట్కాలు


Fri,August 24, 2018 01:02 AM

Vanta-Chitkalu
-పుదినా కొత్తిమీర చట్నీ చేసేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
-ఆపిల్ ముక్కల మీద నిమ్మ రసం రాస్తే రంగు మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.
-క్యాబేజీ కూర వండేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది.
-కూరలు చేసేటప్పుడు నూనె వేడెక్కగానే పసుపు వేస్తే, కూరలు వాటి సహజ రంగును కోల్పోకుండా ఉంటాయి.
-వంకాయకూరలో రెండు చుక్కలు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు, రుచిగా ఉంటుంది.
-నిలువ పచ్చళ్లకు ఆవనూనెను వాడితే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
-బియ్యం నిల్వ చేసిన డబ్బాలో, గుప్పెడు పుదినా ఆకులు వేస్తే పురుగులు పట్టవు.
-నిమ్మరసంలో ఉప్పు కలిపి వంటగది గట్టుని రుద్దితే జిడ్డు పోతుంది.
-పచ్చి బటానీలను ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి.

315
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles