లోబీపీకి కారణాలేంటి?


Tue,February 26, 2019 01:18 AM

బీపీ.. బీపీ అంటుంటారు. కొందరికి తక్కువ ఉంటుంది. కొందరికి ఎక్కువ ఉంటుంది. తక్కువ బీపీ ఎలా వస్తుందో తెలుసుకుందాం.
Low-BP
గర్భం దాల్చిన వారికి రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు వస్తాయి. దీంతో సహజంగానే బీపీ తగ్గుతుంది. కానీ బిడ్డకు జన్మనిచ్చాక చాలా మందిలో ఈ సమస్య దానంతట అదే పోతుంది. కానీ కొందరిలో అలా పోదు. సమస్య అలాగే ఉంటుంది. గుండె కవాటాల్లో సమస్యలు, గుండె సమస్యలు ఉన్నవారిలో రక్త ప్రసరణ సరిగ్గా అవదు. అది లో బీపీకి కారణమవుతుంది. ఎండోక్రిన్ గ్రంథి సమస్యలు ఉంటే లోబీపీ వస్తుంది. థైరాయిడ్, లో బ్లడ్ షుగర్ కూడా ఇందుకు కారణమవుతాయి. నీళ్లను ఎంత తాగినప్పటికీ తీవ్రమైన డీహైడ్రేషన్ సమస్య ఉంటే అది లోబీపీకి దారి తీయవచ్చు. శరీరం లోపల ఎక్కడైనా అంతర్గతంగా గాయమైన రక్తస్రావం ఎక్కువగా ఉంటే అది లోబీపీ వచ్చేందుకు కారణమవుతుంది. రక్తంలో పలు బాక్టీరియాలు, వైరస్‌లు ప్రవేశించి ఇన్ఫెక్షన్ అయినా లోబీపీ వస్తుంది. పలు రకాల ఆహారాలు, మెడిసిన్స్ పట్ల అలర్జీలు ఉంటే అది లోబీపీ వచ్చేందుకు కారణమవుతుంది. మనం తీసుకునే ఆహారంలో తగినంత విటమిన్ బి12, ఫోలేట్ లేకపోతే అది రక్తహీనతకు దారి తీస్తుంది. దీంతో లోబీపీ వస్తుంది.

368
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles