లాంగ్ గౌన్లు..క్రాప్ టాప్‌లు!


Thu,May 18, 2017 11:37 PM

ప్రపంచం కుగ్రామం అయింది.. ఫ్యాషన్ అంతా ఒక్కటైపోయింది.. అందుకే మనదగ్గర వెస్ట్రన్ వేర్ సర్వసాధారణమైపోయింది.. ఇండోవెస్ట్రన్ ైస్టెల్‌లో ఉండే లాంగ్ గౌన్లు.. కాస్త మోడ్రన్ టచ్‌తో ఉండే లెహంగా, క్రాప్ టాప్‌లు.. ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి.. పెళ్ళిళ్ళు, పేరంటాలకు ఇవే సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి..
fashion
ఇక్కత్ ఎక్కడున్నా మిమ్మల్ని సెంటరాఫ్ ఎట్రాక్షన్ చేస్తుంది. నల్లని సిల్క్ ఇక్కత్‌ని లాంగ్ గౌన్‌గా కుట్టాం. దీనికి వచ్చిన పెద్ద బార్డర్ హైలైట్‌గా కనిపిస్తున్నది. ఇక పైన ఆరెంజ్ కలర్ ప్యూర్ సిల్క్‌ని జతచేసి దానికి పోట్లీ బటన్స్ ఇచ్చాం. స్లీవ్స్ మీద సీక్వెన్స్, జర్దోసీ వర్క్‌తో నింపేశాం.

ఆకుపచ్చ సిల్క్ క్రాప్ టాప్ ఇది. దీని మీద గోటా పట్టీ, జర్దోసీ వర్క్‌తో నింపేశాం. దీనికి కూడా కోల్డ్ షోల్డర్ అద్దినట్లు ఉంది. ఇక పీచ్ కలర్ ప్యూర్ సిల్క్ లెహంగా మీద ఫుల్‌గా రాజస్థానీ ైస్టెల్‌లో గోటా పట్టీ వర్క్ చేయించాం. పిస్తా గ్రీన్ కలర్ బార్డర్‌ని జత చేసి దాని మీద గోల్డెన్ లేస్ కుట్టడంతో లెహంగా లుక్కే మారిపోయింది.

నీలాకాశంలో మెరిసే తారకలా కనిపించాలంటే ఈ డ్రెస్ వేయాల్సిందే! లైట్ బ్లూ నెట్ ఫ్యాబ్రిక్‌ని లాంగ్ గౌన్‌గా డిజైన్ చేశాం. వెస్ట్రన్ ైస్టెల్‌లో ఉండేలా ఎక్కువ గేర్‌తో దీన్ని కుట్టాం. నెక్ దగ్గర సీక్వెన్స్, చిప్స్‌తో హెవీగా వర్క్ చేశాం. 3/4 స్లీవ్స్‌తో గౌన్ లుక్కే మారిపోయింది.
fashion1
ఎండలో వెన్నెల్లా కనిపించేందుకు తెల్లని లాంగ్ గౌన్ పర్‌ఫెక్ట్ ఛాయిస్. తెల్లని ఆర్గంజా మీద ఎర్రని పూల మాదిరి ఆప్లిక్ వర్క్ చేశాం. డ్రెస్ మొత్తం ఇదే వర్క్ వస్తుంది. బాక్స్ ప్లీట్స్ పెట్టి పైన ఎర్రని లైక్రా ఫ్యాబ్రిక్ అటాచ్ చేశాం. దీనికి హాల్టర్ నెక్ హైలైట్‌గా నిలిచింది.

డార్క్ బ్లూ కలర్ వెల్వెట్‌తో లెహంగా కుట్టాం. దాని మీద మొత్తం జరీ వర్క్‌తో నింపేశాం. గోల్డెన్ జరీ వచ్చిన లేస్‌ని బార్డర్‌గా జతచేశాం. ఇక క్రాప్‌టాప్‌కి పింక్ కలర్ ప్యూర్ సిల్క్ ఎంచుకున్నాం. దీని మీద కుందన్స్, జర్దోసీ, ముత్యాలతో హెవీగా వర్క్ చేశాం. కోల్డ్ షోల్డర్, ఫుల్‌స్లీవ్స్‌తో రాజకుమారిని తలపింపొచ్చు. స్లీవ్స్ మీద గ్లాస్ ట్యూబ్స్‌తో వర్క్ చేశాం.
దీప్తి గణేష్
అంబర డిజైనర్ స్టూడియో
కూకట్ పల్లి, హైదరాబాద్
8142420088,
9848671986
www.facebook.com/
ambarastudio

603
Tags

More News

VIRAL NEWS