లవ్ అడిక్షన్‌తో జాగ్రత్త!


Tue,September 25, 2018 10:45 PM

యుక్త వయసులో పుట్టే ప్రేమను ఎలాగూ అంచనా వేయలేమని అంటున్నారు నిపుణులు. ఎంతకాలం నిలిచి ఉంటుందో.. ఎప్పుడు విచ్ఛిన్నమవుతుందో చెప్పలేమంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. మద్యం, మత్తు పదార్థాల్లాగే ప్రేమ అనే భావన కూడా ఓ వ్యసనమనే అంటున్నారు. లవ్ అడిక్షన్‌తో యువత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Love-Addict
లవ్ ఎట్ ఫస్ట్‌సైట్ టీనేజర్స్ నుంచి మధ్య వయస్కుల వరకూ ఆయా సందర్భాల్లో వారి మాటల్లో వింటూనే ఉంటాం. జీవితంలో ఎదురుపడ్డ కొత్త వ్యక్తిని చూడగానే ఇతను/ఈమె కోసమే నేనింత కాలం ఎదురు చూస్తున్నది అనిపించేలా చేస్తుంది మెదడులోని న్యూరో కెమికల్ ఉత్ప్రేరకం. ఈ క్రమంలో ప్రేమ నిడివి క్రమంగా పెరుగుతూ.. ఎక్కువ కాలం మెదడులో నిక్షిప్తమయ్యేలా రసాయనాలు దోహదపడతాయని అంటున్నారు లవ్/సెక్స్ అడిక్షన్ స్పెషలిస్ట్‌లు. మద్యం, మత్తుకు బానిసలైన వారూ, ప్రేమకు బానిసలైన వారూ ఎక్కువకాలం అదే లోకంలో ఉండడానికి కారణం మెదడులోని న్యూరో కెమికల్ అని వారు అంటున్నారు. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్స్ డయాగ్నొస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్.. లవ్ అడిక్షన్ లక్షణాలను ఈ విధంగా అంచనా వేస్తున్నారు.


లవ్ అడిక్షన్‌లో ఉన్నవాళ్లు మిగతా తమకున్నది ఓ వ్యసనమని అంగీకరించడానికి ఇష్టపడరు. లవ్ అడిక్షన్ బాధితులు తమ ప్రవర్తన వల్ల మానసికంగా ఒంటరులవుతారు. వృత్తిలో, చదువులో వెనకబడతారు. వారి మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతకుముందు ఆనందాన్ని అందించిన... స్నేహితులతో కబుర్లు, వ్యాయామాలు, అభిరుచులు ఆనందాన్ని అందించడం మానేస్తారు. ప్రేమ వెతుకులాటలో ఆత్మీయులు, కుటుంబీకులు, స్నేహితుల పట్ల నెరవేర్చాల్సిన బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తారు. ఇలాంటి మత్తులో ఉన్నప్పుడు ప్రియుడు/ప్రేయసి దూరమైనా, బ్రేకప్ చెప్పినా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడరని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి, ప్రేమలో ఉన్న వ్యక్తులను ఎప్పటికప్పుడు గైడ్ చేయడం ఉత్తమమని చెబుతున్నారు.

1303
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles