రోబోల హంగామా!


Sat,September 29, 2018 10:58 PM

రోబో సినిమాలో చిట్టి రోబో అన్ని పనులూ చక్కబెడుతుంటే నోరెళ్లబెట్టి చూశాం. మరిప్పుడు నిజజీవితంలోనూ అలాంటి రోబోలు వచ్చేశాయి. రెస్టారెంట్లలో వెయిటర్లుగా.. హోటల్స్‌ల్లో లగేజ్ మోసే బెల్ బాయ్స్‌లాగా.. విశ్వాసంగా ఉంటూ మంచి స్నేహితుడిలా మారే కుక్కలాగా ఈ రోబోలు తయారవుతున్నాయి. మరి అలాంటి చిట్టి రోబోల ముచ్చట్లు మీకోసం.

డైనోసార్ రోబో

robo
నడిచే రోబో, పనిచేసే రోబోలను చూసే ఉంటాం. కానీ డైనోసార్ రోబోలను చూడడం ఇదే మొదటిసారి కదా! అది కూడా మాట్లాడే డైనోసార్ అంటే వినడానికి వింతగానే ఉంది కదూ!! డైనోసార్ రోబోలు జపాన్‌కు చెందిన హోటల్‌లో ఉద్యోగం చేస్తున్నాయి. వంద గదులున్న హోటల్‌లో 186 రోబోలున్నాయి. రిసెప్షన్, రూములు చూపించడం, లగేజ్ మోయడం వంటి అన్ని పనులూ ఈ రోబోలే చేస్తాయి. దీంతో ఈ హోటల్‌కు వచ్చే కస్టమర్లు వింతగా చూస్తున్నారు. కస్టమర్లు అడిగే ప్రశ్నలకు రిసెప్షనిస్టు నెమ్మదిగా వివరంగా సమాధానం ఇస్తుంది. కస్టమర్ల దగ్గర అన్ని ఆధారాలు తీసుకున్నాకే హోటల్లో ఉండడానికి అంగీకరిస్తాయి ఈ రోబోలు. చెప్పకుండానే లగేజ్‌ను వారికి కేటాయించిన రూముకి తీసుకెళ్తాయి. వీటి వల్ల కస్టమర్లకు ప్రశాంతంగా ఉందని చెప్తున్నారు. ప్రతీ గదిలో ఒక రోబో ఉంటుంది. కస్టమర్లకు కావాల్సినవి అందిస్తుంటుంది. లోపలికి వచ్చిన కస్టమర్ ముఖాన్ని స్కాన్ చేసుకుంటుంది. వారికి కేటాయించిన రూములోకి వేరొకరిని మాత్రం అనుమతించదు. దీనివల్ల ఎటువంటి దొంగతనం జరుగకుండా ఉంటుంది. హోటల్ మొత్తం ఇలాంటి రోబోలతోనే నడిపిస్తున్నారు. జపాన్‌లో ఈ హోటల్ చాలా ప్రత్యేకమైంది.


పెంపుడు రోబో

robo5
పెంపుడు జంతువుగా కుక్కను ఎక్కువగా పెంచుకుంటారు. మంచి స్నేహితుడిగా కుక్కనే భావిస్తారు. ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళ్తుంటారు. వాటికి ఆరోగ్యం బాగులేకపోతే బెంగపెట్టుకుంటారు. అదే పెంపుడు జంతువు రోబో అయితే భలే ఉంటుంది కదా. దానికి చావుండదు. ఎప్పుడూ మన వెంటే ఉంటుంది. సోనీ కంపెనీ ఐబో రోబో డాగ్‌ను జపాన్‌లో లాంచ్ చేసింది. ఈ రోబో అచ్చం కుక్కలాగే ఉంటుంది. తోక ఊపడం, చెవులు కదిలించడం, నడువడం మొత్తం కుక్క చేసినట్టుగానే చేస్తుంది. రోబోకు యాక్చువేటర్స్, సెన్సార్‌ను కనెక్ట్ చేశారు. అలా చేయడం వల్ల 4,000 పార్ట్స్, 22 యాక్టుయేటర్స్‌తో తోకను కదిలిస్తుంది. 100 మందికి పైగా మనుషులను గుర్తు పెట్టుకుంటుంది. రోబోను తాకగానే స్పర్శ గ్రహిస్తుంది. కండ్లకు బదులుగా ఆర్గానిక్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే అమర్చారు. ఇవి అతిత్వరలో యూఎస్‌లో అందుబాటులోకి రానున్నాయి. పెంపుడు జంతువులను ఇష్టపడేవారు వీటిని తెచ్చుకోవచ్చు.


వెయిటర్ రోబో

robo3
హోటల్‌కి వెళ్లగానే వెయిటర్‌ని పిలుస్తాం. వెంటనే వచ్చి మనకు కావాల్సినవి పెట్టి.. ఆ తర్వాత బిల్లు చెల్లించే వరకు మనతో పాటుగానే ఉంటాడు వెయిటర్. ఇలా నలుగురి దగ్గరకీ వెళ్లి చకచకా పనిచేసి, అటు యజమాని పనులను చక్కబెట్టేందుకు ఒక చిట్టి రోబో వచ్చేసింది. టోక్యో నగరంలోని కేఫ్‌లో ఒక అతను వెయిటర్ ఉద్యోగం చేస్తుంటాడు. పూట గడవడం కోసం ఉద్యోగం చేయక తప్పదు మరి. ప్రతిరోజూ చేసి విసిగిపోయేవాడు. అతనే ఈ చిట్టి రోబోను తయారుచేశాడు. రోబోలో ఎలక్ట్రిక్ చిప్ కూడా ఇన్‌స్టాల్ చేశాడు. ఇది ఎక్కడుంటే అక్కడ చుట్టూ జరిగే ఆడియో, వీడియో రికార్డ్ అవుతుంది. రోబోను కంప్యూటర్, టాబ్లెట్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో నుంచి రోబోను ముందుకు నడిపించవచ్చు. అందుకే ఆ వెయిటరే ఒక హోటల్‌ని పెట్టి కేఫ్‌కు వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని ఆపరేట్ చేస్తూ అందరికీ సర్వ్ చేస్తున్నాడు. వెయిటర్ రోబోతో సర్వ్ చేయించుకోవడానికి చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఎగబడుతున్నారు. రోబో పుణ్యమా అంటూ ఆ కేఫ్ లాభాల్లో నడుస్తున్నది.
robo4


robo2


706
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles