రోబోల కిచెన్ రాబోతున్నది!


Tue,July 24, 2018 11:37 PM

వంటింటి వైపు.. ఏయ్ రోబో.. అర్జెంటుగా నాలుగు కాఫీలు పెట్టు.. ఫ్రెండ్స్ వచ్చారు అని కేకేస్తే రెండు నిమిషాల్లో కాఫీ మీ ముందుంటుంది. మధ్యాహ్నం మీ కడుపులో ఎలుకలు పరుగెత్తే సమయానికి టంచనుగా వంట పూర్తయిపోతుంది. గంటలు గంటలు వంటింట్లో యుద్ధం చేస్తేనే గానీ పూర్తవని వంటలు.. ఇకపై నిమిషాల్లో పూర్తి కానున్నాయి. అసలు మనుషులు వంటింట్లోకి అడుగుపెట్టే అవసరమే లేకుండా కిచెన్, వంటపని మొత్తం రోబోలే చూసుకుంటాయి. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా.. పూర్తిగా చదువండి మరి.
robotic-kitchen
ఒకప్పుడు అంతో ఇంతో సంపాదిస్తే చాలు.. ఇంటి పనికి, వంటపనికి ఓ మనిషిని పెట్టుకునేవారు. ఏకంగా ఒకేసారి ఓ వందమందికి వంటచేసి పెట్టాలంటే మాత్రం కిరాయికి వంటమనిషిని మాట్లాడుకునే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతున్నది. అయితే.. టెక్నాలజీ వల్ల ఎన్నో రంగాల్లో, చాలా విషయాల్లో వినూత్న మార్పులొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాట్లాడుకునే సందర్భం ఏంటంటే.. మసాచుసెట్స్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ వారు ఓ కిచెన్ రూపొందించారు. అది పూర్తిగా రోబోల ఆధ్వర్యంలో నడుస్తుంది. ఏ ఐటమ్ కావాలన్నా చిటికెలో మీ ముందుండేలా ఆ రోబోటిక్ కిచెన్ ను రూపొందించారు.


robot-chef
మసాచుసెట్స్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌కి చెందిన నలుగురు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బోస్టన్‌లో ప్రయోగాత్మకంగా ఓ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. అందులో పనిభారం తగ్గేందుకు, వంటపని వేగంగా అయ్యేందుకు ఏం చేస్తే బాగుంటుందా? అని ఆలోచించారు. ఆ రెస్టారెంట్‌లోని కిచెన్‌ని పూర్తిగా రోబోటిక్‌గా మార్చేశారు. మొత్తం ఏడు రోబోలను తయారుచేసి ఈ కిచెన్‌లో అమర్చారు. వంటపని, వాషింగ్, కటింగ్, మిక్సింగ్ ఇలా ఒక్కో రోబో ఒక్కో పనిచేస్తుంది. ఒక్కో రోబో మూడు నిమిషాల్లోనే కనీసం 200 ప్లేట్లకు అవసరమైన పని చేయగలదు. 200 ప్లేట్ల టిఫిన్ ఆర్డర్ చేస్తే మూడు నిమిషాల్లో మీ ముందు రెడీగా ఉంటుందట. గానూ.. వాషింగ్, మిక్సింగ్, కటింగ్ ఇలా అన్ని పనులూ రోబోలే మూడు నిమిషాల్లో పూర్తి చేసేస్తాయి. రోబోటిక్ కిచెన్‌లో మూడు నిమిషాల్లో 200 ఆర్డర్లు, వంద రకాల వెరైటీలు రెడీ చేయొచ్చు.


fresh-robot-kitchen
ఈ రోబోలు వండిన వంట రుచి చూడాలంటే మీరు ఎంత చెల్లించాలో తెలుసా..? కేవలం పది డాలర్లు మాత్రమే. మనుషులకు పనిభారం తప్పించే ఆలోచనతో ఈ ఐడియాకు రూపమిచ్చిన ఇంజినీర్లు ఎక్కువమందిని ఆకర్షించడానికి, ఎక్కువమందికి ఈ విషయం తెలియడానికి తక్కువ ధరలకే రోబోలు వండిన ఫుడ్ అందిస్తున్నారు. బౌల్స్ పేరుతో రోబోలు వండిన వెజిటేరియన్ ఫుడ్ ఈ రెస్టారెంట్‌లో కేవలం ఏడున్నర డాలర్లే. రోబోటిక్ కిచెన్ కదా ఈ రెస్టారెంట్‌లో అసలు మనుషులే ఉండరనుకోకండి. ఆ రోబోలను ఆపరేట్ చేసేది మనుషులే. ఏ రోబోకి ఏ పని చెప్పాలి? ఎంత ఆర్డర్ వచ్చింది? ఎంత టైమ్ ఉంది? అనే నిర్ణయాలు తీసుకొని రోబోలకు పని చెప్తారు. ఈ రోబోలు వండిన ఆహారాన్ని రుచి చూడడానికి ఓ మేనేజర్ కూడా ఉంటాడు. అన్నీ సరిపోయి, రుచి బాగా ఉంటేనే.. ఆ ఫుడ్‌ని కస్టమర్లకు సర్వ్ చేయడానికి ఓకే చెప్తాడు. అంతా బాగుంటేనే ఆ ఫుడ్ కస్టమర్ టేబుల్ మీదకు వెళ్తుంది. ఈ రెస్టారెంట్‌కి వెళ్తే మీ టేబుల్ మీద ఉన్న టచ్‌పాడ్‌లో మీకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఇస్తే చాలు. రోబోలు చకచకా రెడీ చేసేస్తాయి. వేడివేడిగా లాగించేయొచ్చు. 2020 కల్లా ఈ రోబోటిక్ కిచెన్ పూర్తిస్థాయిలో పరిశోధన పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తుందట.


robo-team
-మొబైల్ చార్జింగ్ పెట్టినప్పుడు తొందరగా బ్యాటరీఫుల్ కావాలంటే మొబైల్ ైఫ్లెట్ మోడ్‌లో పెట్టండి. అనవసర సెట్టింగులు ఆఫ్‌లో ఉంచండి.
-మొబైల్ బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత పవర్‌సాకెట్ నుంచి చార్జర్ తీసేయండి. అలాగే ఉంచితే విద్యుత్ వినియోగం పెరుగుతుంది.
-మొబైల్లో చార్జింగ్ ఎక్కువసేపు ఉండాలంటే డిస్‌ప్లే వెలుతురు తక్కువలో పెట్టుకోండి. అవసరం లేనప్పుడు డాటా ఆఫ్‌లో పెట్టండి.

400
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles