రోజువారీ ఉత్తమ ఆహారం!


Thu,December 6, 2018 11:43 PM

రోజంతా ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండేందుకు మనం తినే ఆహారం చాలా కీలకం. అందుకే రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు... అవేంటో ఓసారి చూద్దామా?

women-food
-శరీరానికి తప్పనిసరిగా అవసరమయ్యే ఆహార పదార్థాల జాబితాలో ఓట్స్ ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. కండరాలకు మంచి పరిపుష్టిని కలిగిస్తుంది.
-వాల్‌నట్స్ మహిళల ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తాయి. రోగనిరోధక శక్తితోపాటు రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు పోతాయి. రుతుస్రావ సమస్యలు ఉండవు.
-బ్లాక్ బీన్స్ జ్ఞాపక శక్తిని పెంచడానికి దోహదపడుతాయి. ఇందులో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్, ఆంథోసియానిన్స్ ఎక్కువ మోతాదులో దొరుకుతాయి.
-బ్లూ బెర్రీస్.. పండ్ల జాతుల్లోనే అత్యంత ఆరోగ్యకరమైనవి. వీటిలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ ఉంటాయి.
-క్యారెట్ కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థరైటిస్, ఆస్తమా, క్యాన్సర్ వంటి రోగాలను దూరంగా ఉంచుతుంది.
-పాలకూరలో లభించే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతాయి.
-టమాటాలో ఉండే పలురకాల పోషకాలు మూత్రాశయ రోగాలు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ల ప్రమాదం నుంచి రక్షించగలుగుతాయి.

711
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles