రోగ నిరోధకశక్తి కోసం..


Tue,February 26, 2019 01:16 AM

ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బు బారిన పడతారు. కానీ అలా పడకుండా అందరికీ రోగ నిరోధక శక్తి ఉంటుంది. అది ఎక్కువగా ఉంటే ఎలాంటి రోగమైనా దరిచేరదు. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి.
Immunity
అశ్వగంధ:శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో, కోల్పోయిన శక్తిని తిరిగి ఇవ్వడంలో అశ్వగంధ మెరుగ్గా పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాలు ఇందులో మెండుగా ఉన్నాయి. అశ్వగంధ మొక్క వేర్ల పొడిని నిత్యం 3 నుంచి 6 గ్రాముల మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని ఆవుపాలతో తీసుకుంటే చక్కని ఫలితాలు వస్తాయి.

తులసి :యాంటీ ఆస్తమాటిక్, యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలు తులసిలో పుష్కలంగా ఉన్నాయి. శ్వాసకోశ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తులసి ఆకుల రసాన్ని నిత్యం తీసుకుంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ గాడిలో పడుతుంది. అల్లం, తేనె వంటి వాటితో దీన్ని కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.

అల్లం : శరీరంలో ఏర్పడే వాత, కఫ దోషాలను అల్లం తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు ఇన్ఫెక్షన్లపై పోరాడుతుది. ఆర్థరైటిస్, గౌట్, ఎడిమా, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులకు అల్లం ఉపయోగకరం. పలు శ్వాసకోశ వ్యాధులను తగ్గించే గుణం అల్లంకు ఉంది.

పసుపు: రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. సాధారణ జలుబు, పొడి చర్మం, కీళ్ల నొప్పులు, వాపులు వంటి అనారోగ్యాలకు ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుంది. నిత్యం దీన్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదులో వేడిపాలు లేదా నీటితో తీసుకోవాలి.

ఉసిరి :ఇందులో విటమిన్ సితోపాటు కాల్షి యం, ఐరన్, పాస్ఫరస్, ఫైబర్లు అధికంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి వాత, పిత్త, కఫాల హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. నిత్యం రెండుసార్లు దీన్ని తీసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పొడిగా, కాయగా లేదా ఇతర పండ్లతో కలిపి కూడా దీన్ని తీసుకోవచ్చు.

186
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles