రెరా.. ఫిర్యాదు ఇలా


Sat,August 4, 2018 01:45 AM

మోసపూరిత నిర్మాణ సంస్థల నుంచి ఇండ్ల కొనుగోలుదారులను రక్షించాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెరా చట్టాన్ని ఈ నెల నుంచి అందుబాటులోకి తీసుకురానున్నది. 2017 జనవరి 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో 500 చదరపు మీటర్ల కంటే అధిక విస్తీర్ణంలో ఆరంభమైన అపార్లుమెంట్లు, లేఅవుట్లలో ప్లాట్లు, వాణిజ్య సముదాయాల్లో స్పేస్‌ను కొన్నవారు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఇటీవల హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో రెరాపై కొనుగోలుదారులకు ప్రత్యేక అవగాహన సదస్సుని రెరా విభాగం నిర్వహించింది. డెవలపర్లు అయినా ఏజెంట్లు అయినా మోసం చేస్తే.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే.. రెరా అథారిటీకి ఎలా ఫిర్యాదు చేయాలో వెల్లడించింది. బాధిత పక్షాన తాముంటామని భరోసాను కల్పించింది. మరి, మోసం చేసే డెవలపర్ల మీద కొనుగోలుదారులు ఎలా ఫిర్యాదు చేయాలంటే..
real-estate-bill
-ముందుగా రెరా వెబ్‌సైటులోకి వెళ్లాలి. మీరు ప్రమోటరా? ఏజెంటా? లేదా ఫిర్యాదా? అనే ఆప్షన్లు ఉంటాయి. ఇందులో ఫిర్యాదు అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. యూజర్ ఐడీ, పాస్‌వర్డును క్రియేట్ చేసుకోవాలి. మీ ఐడీ ఏర్పాటు చేసుకున్నట్లు మొబైల్‌కి సమాచారం వస్తుంది. ఆతర్వాత మై ప్రొఫైల్ రూపొందించుకోవాలి. ఇందులో మీ పూర్తి వివరాల్ని పొందుపర్చాలి. ఇంటి చిరునామా, ల్యాండ్‌మార్క్, అపార్టుమెంట్ పేరు, పిన్ కోడ్ వంటివి ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ వివరాల్ని ఎంటర్ చేయాలి. ఇవన్నీ సక్రమంగా చేశాక సేవ్ బటన్ నొక్కాలి. మొత్తం మన పూర్తి సమాచారం రెరా సైటులో నిక్షిప్తమవుతుంది.
-ఆతర్వాత, ఎవరి మీద ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో.. అట్టి వివరాల్ని నమోదు చేయాలి. ఆయా ప్రాజెక్టు గనక రెరా వద్ద నమోదు అయితే అట్టి రిజిస్టర్ నెంబర్, ప్రాజెక్టు పేరు, అందులో అమ్మకాల్ని నిర్వహిస్తున్న ఏజెంటు ఉంటే తన పేరు, ప్రమోటర్ పేరు వంటివి పొందుపర్చాక సేవ్ చేయాలి. తర్వాత ఫిర్యాదు ఎవరి మీద చేస్తున్నారో రాయాలి. పూర్తి చిరునామాను నమోదు చేయాలి.

-పలు డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదుకు సంబంధించిన నిజనిజాలు, ఎలాంటి పరిహారం కోరుకుంటున్నారు? ఇంటెరిమ్ ఆర్డర్ కావాలా? లేక తుది తీర్పు కోసం ఎదురు చూస్తున్నారా? వంటివి తెలియజేయాలి. ఈ డాక్యుమెంట్ సైజు 1 ఎంబీ కంటే తక్కువుండేలా చూడాలి. చివర్లో డిక్లరేషన్ రాసివ్వాలి. రెరాకు సొమ్ము చెల్లించాలి. ఇందుకోసం నాలుగు ఆప్షన్లను కలిపించారు.
డెవలపర్లకు ఎలాంటి శిక్ష?
రెరా నిబంధనల్ని పాటించకున్నా.. రెరా అథారిటీ ఆదేశాల్ని బేఖాతరు చేసినా.. ఏజెంటు అయినా డెవలపర్ అయినా శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకోవాల్సిందే. సెక్షన్ 59 సబ్ సెక్షన్ 2 ప్రకారం, డెవలపర్‌కు జైలు శిక్ష విధిస్తారు. ప్రాజెక్టు వ్యయంలో పది శాతం జరిమానాను విధిస్తారు. ఏజెంటుకైనా ఇదే శిక్ష ఉంటుంది. ఒకవేళ ప్లాటు అమ్మినా, పది శాతం జరిమానా, జైలు శిక్ష తప్పదు.

323
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles