రెరా అనుమతి లేకుండా ప్రకటనలా?


Sat,July 21, 2018 01:31 AM

Rera
రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) అనుమతి పొందకుండా ప్రకటనల్ని విడుదల చేస్తున్న బిల్డర్లపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నివాస సముదాయాల ప్రాజెక్టులు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా రెరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. కొత్తగా 500 చదరపు మీటర్లు లేదా ఎనిమిది ఫ్లాట్ల పరిమితి దాటితే రెరా నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే రెరా అమలవుతున్న కొన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధన ఉల్లంఘనకు గురవుతున్నది. తాజాగా గోవాలో ఇదే జరిగింది. అక్కడి బిల్డర్లు రెరా ప్రకారం, రిజిస్ట్రేషన్ చేసుకోక ముందే తమ నిర్మాణాలకు సంబంధించిన ప్రకటనలు జారీ చేశారు. గోవాలోని ఓ సామాజిక కార్యకర్త ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సదరు బిల్డర్లు ఎలాంటి ప్రాజెక్టును రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే ప్రకటనలు ఇచ్చారని, మార్కెటింగ్, ఫ్లాట్ల బుకింగ్, అమ్మకాలు తదితర కార్యక్రమాలు చేపట్టారని ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గోవా రెరా అధికారులు విచారణ చేపట్టారు. రెరా వద్ద ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తేలడంతో, నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు బిల్డర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరణతో తమ ముందు హాజరు కావాలని గడువు విధించారు.

ఈ నెల 25న..రెరాపై సమావేశం..

రెరా చట్టంలోని అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 25న బుధవారం సీడీఎంఏ కార్యాలయంలో డెవలపర్లు, రియల్టర్లు, ఏజెంట్లతో సమావేశం నిర్వహిస్తారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల సమాచారం, రెరా చట్టంలో పొందుపరిచిన విషయాల గురించి ఈ సమావేశంలో తెలియజేస్తారు. ప్రజలకు రెరా చట్టంపై అవగాహన కల్పించేందుకు గురువారం నాడు కొనుగోలుదారుల సంఘాలతో సమావేశం నిర్వహిస్తారు.

130
Tags

More News

VIRAL NEWS