రెండెకరాల్లో 110 వెరైటీలు


Tue,July 18, 2017 12:32 AM

వ్యవసాయం చేయడమే మహాకష్టం అనుకునే ఈ రోజుల్లో రెండెకరాల పొలంతో ఏం చేయగలం? చాలామందిలో మెదిలే సాధారణ ప్రశ్న ఇది. కానీ రెండెకరాల పొలంలోనే అద్భుతం చేస్తున్నాడు ఓ ఔత్సాహిక రైతు.
farmer
మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా పితౌరాబాద్‌కు చెందిన బాబూలాల్‌ది వ్యవసాయ కుటుంబం. అందుకే ఆయనకు కూడా వ్యవసాయం అంటే మక్కువ ఏర్పడింది. చదువుకోవడానికి పట్నం వెళ్లిన ఆయన, సెలవుల్లో వచ్చినప్పుడు తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉండేవాడు. పంట కోతల్లో సాయపడేవాడు. చదువు పూర్తయ్యాక ఊళ్లోనే పోస్టు మాస్టరుగా ఉద్యోగం సంపాదించాడు. మధ్యప్రదేశ్‌లోని బగేలి అనే స్థానిక మాండలికంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ఈ మాండలికాన్ని మరింత వెలుగులోకి తెచ్చేందుకు ఆయన అనేక రచనలు కూడా చేశాడు. అలా పరిశోధన చేస్తున్నప్పుడు ఎప్పుడూ వినని ఒక బియ్యం పేరు ఆయనకు తారసపడింది. అలా మరెన్ని రకాల బియ్యం ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాడు. వివిధ రాష్ర్టాల్లో సంచరించి మొత్తం 110 వెరైటీల ధాన్యం ఉందని గుర్తించాడు. వాటన్నింటినీ విత్తనాలుగా సేకరించి తనకున్న పొలంలో సాగు చేయడం ప్రారంభించాడు. కేవలం రెండెకరాల్లో వందకు పైగా వెరైటీల ధాన్యాన్ని పండించడంతో చుట్టుపక్కల రైతులందరూ బాబూలాల్ ఫామ్‌ను సందర్శిస్తున్నారు. తరతరాలుగా అక్కడి రైతులు పండిస్తున్న సంప్రదాయ వరి ధాన్యంతో పాటు ప్రయోగాత్మకంగా వందల వెరైటీల ధాన్యాన్ని పండిస్తూ.. తన ఫామ్‌ను పరిశోధనాలయంగా మార్చేశాడు బాబూలాల్. దీనిపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులు కూడా నిర్వహిస్తున్నాడు. జీవవైవిధ్యాన్ని కాపాడేలా అందరూ వ్యవసాయంలో సేంద్రీయ పద్ధతుల్ని పాటించాలని సూచిస్తున్నాడు.

1053
Tags

More News

VIRAL NEWS