రూ. 7554 కోట్ల ఎస్‌ఐపీ పెట్టుబడులు


Sat,August 25, 2018 01:21 AM

రియల్ ఎస్టేట్, బంగారంపై తగ్గని ఆసక్తి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల వరద
investment
మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడానికి రిటైల్ ఇన్వెస్టర్లు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఐపీ)లను ఎంపికచేసుకుంటున్నారు. జూలై నెలలో ఎస్‌ఐపీల ద్వారా వచ్చిన మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు 53 శాతం పెరిగి రూ. 7,554 కోట్లకు చేరుకున్నాయి.2017-18లో రూ. 67,000 కోట్లు, 2016-17లో రూ. 43,900 కోట్లు ఎస్‌ఐపీల ద్వారా మదుపు చేశారనీ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ) తెలిపింది. మార్కెట్ రిస్క్‌లను తగ్గించుకోవడానికి ఎస్‌ఐపీలు ఉత్తమ మార్గంగా రిటైల్ ఇన్వెస్టర్లు ఎంచుకుంటున్నారని ఏఎంఎఫ్‌ఐ పేర్కొంది. సంప్రదాయ అసెట్లు అయిన రియల్ ఎస్టేట్, బంగారం లాంటి సాధనాల్లో మదుపు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడంలేదని తెలిపింది. ఎస్‌ఐపీ ల ద్వారా పెట్టుబడులు పెరుగుతున్నందున మార్కెట్ రిస్క్‌లు, ఎస్‌ఐపీ ప్రయోజనాలకు సంబంధించి ఇన్వెస్టర్ల అవగాహన అవసరముందని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల కాలంలోనే రూ. 29,102 కోట్ల పెట్టుబడులు ఎస్‌ఐపీ ద్వారా వచ్చాయి. వివిధ మ్యూచువల్ ఫండ్స్ వద్ద మొత్తం 2.33 కోట్ల ఎస్‌ఐపీ అకౌంట్లు ఉన్నాయి. ఈ నాలుగు నెలల కాలంలో కొత్తగా 9.92 లక్షల ఎస్‌ఐపీ అకౌంట్లు వచ్చాయని పేర్కొంది. సగటున ఒక్కో ఇన్వెస్టర్ రూ. 3,250 మదుపు చేస్తున్నట్టుగా ఏఎంఎఫ్‌ఐ వెల్లడించింది.

335
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles