రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోచికిత్స


Wed,August 30, 2017 01:15 AM

రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక ఆటోఇమ్యూన్ సమస్య. శరీరంలోని సొంత నిరోధక వ్యవస్థ కీళ్ల కణజాలం మీద దాడి చేయడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. మనదేశంలో సుమారు 7 మిలియన్ల ప్రజలు రుమాటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. అందులో పురుషుల కంటే స్త్రీలలో మూడు రెట్లు అధికంగా కనిపిస్తున్నది.అధునాతన హోమియో వైద్యంతో ఈ వ్యాధిని సమర్థవంతంగా నయం చెయ్యవచ్చు. సూక్ష్మీకరణ పద్ధతిలో తయారు చేసిన హోమియోమందులు ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా పూర్తిగా నయం చెయడం జరుగుతుంది.

ఇది చాలా నెమ్మదిగా పెరిగే సమస్య. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో కనబడుతుంది. మొదట చిన్న చిన్న కీళ్లలో, తర్వాత పెద్దకీళ్లలో సమస్య మొదలవుతుంది. కీళ్లలోని సైనోవియల్ పొర తర్వాత నెమ్మదిగా కార్టిలేజ్ దెబ్బతింటుంది. ఫలితంగా కీళ్ల ఆకారం, అమరిక కోల్పోయి విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఈ వ్యాధి కొందరిలో కీళ్లు మాత్రమే కాదు ఇతర అవయవాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రక్తనాళాలు, చర్మం వంటి వాటి మీద దుష్ప్రభావాలు కనిపిస్తాయి.

ఎవరిలో..?

కీళ్ల వాతం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ, సాధారణంగా పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని జువైనల్ ఆర్థరైటిస్ అంటారు.

కారణాలు

మన శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని కణాలు వ్యతిరేకంగా పనిచేసి ఆరోగ్యవంతమైన కణాలపై దాడి చేస్తాయి. ముఖ్యంగా కీళ్లలోని సైనోనియం పొరపై ప్రభావితం చేయడం వల్ల వస్తుంది. సాధారణంగా మన శరీరంలో తెల్లరక్తకణాలు వ్యాధి నిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్ మరియు ఇతర పరదీయ పదార్థాల నుంచి నిత్యం కాపాడుతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులలో తెల్లరక్త కణాలు కీళ్ల చుట్టూ ఉండే సైనోవియంలోకి వెళ్లి ప్రొటీన్లు విడుదల చేస్తాయి. దీంతో సైనోవియం పొర మందంగా మారి క్రమంగా కీళ్ల లోపలి ఎముకలు, కార్టిలేజ్ ఇన్‌ఫ్లమేషన్‌కు గురై కీళ్ల అమరికలో మార్పు వచ్చి వైకల్యానికి దారి తీస్తుంది.
జన్యుపరమైన, జీవన శైలి పరమైన కారణాల వల్ల కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది.

లక్షణాలు

కీళ్ల వాపు, నొప్పి, చేతితో తాకితే వేడిగా ఉండడం, ఉదయం లేవగానే కీళ్ల కదలికలు బాధాకరంగా ఉండడం, బిగుసుకు పోవడం ఈ లక్షణాల తీవ్రత ఎప్పుడూ ఒకే తీరుగా కాకుండా పెరుగుతూ, తగ్గుతూ ఉండవచ్చు. అంతేకాకుండా రెండు వైపులా ఒకే రకం కీళ్లు ప్రభావితం కావడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వీటికి తోడు రక్తహీనత, ఆకలి సరిగ్గా లేకపోవడం నిస్సత్తువ, బరువు తగ్గడం, కొద్దిపాటి జ్వరం, మోచేయి, మనికట్టు వంటి కీళ్లలో చర్మం కింద చిన్నచిన్న బుడిపెలు (రుమటాయిడ్ నాడ్యూల్స్) ఏర్పడవచ్చు.

నిర్ధారణ

సీబీపీ, ఈఎస్‌ఆర్, ఆర్‌ఏ ఫ్యాక్టర్, ఏఎన్‌ఏ, యాంటి సీపీసీ, ఎక్స్‌రే, ఎమ్‌ఆర్‌ఐ, మొదలైన పరీక్షలు వ్యాధి నిర్ధారణకు తోడ్పడుతాయి.

హోమియోకేర్ చికిత్స

చాలా రకాల ఆటోఇమ్యూన్ జబ్బులు సైకోసొమాటిక్ డిజార్డర్స్ కిందకి వస్తాయి. అన్ని రకాల సైకోసొమాటిక్ డిజార్డర్స్‌కి హోమియోలో చక్కని పరిష్కారం లభిస్తుంది. అందులో ఒకటైన రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి కూడా హోమియోలో సంపూర్ణ చికిత్స ఉంది. ఇతర చికిత్సా విధానాల్లో కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభ్యమవుతుంది. కానీ హోమియోపతిలో పూర్తి చికిత్స అందుబాటులో ఉంది. అయితే ఈ మందులను రోగి వ్యక్తిగత లక్షణాలు, స్వరూప స్వభావాల ఆధారంగా నిపుణుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
Drsrikanth

468
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles