రుచి ఫుల్ సీతాఫల్


Thu,November 27, 2014 02:11 AM

చలికాలం వచ్చిందంటే చాలు సీతాఫలాలు నోరూరిస్తాయి.. ఒంటినిండా కళ్లతో.. తెల్లటి గుజ్జుతో యమా స్వీట్‌గా ఉండే కస్టర్డ్ యాపిల్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.... కాని పిల్లలకు వాటి గింజలను తీసి తినాలంటే కష్టం.. పైగా వాళ్లకు ఒకటే టైప్ టేస్ట్‌లంటే నచ్చదు అందుకే స్వీట్ కిడ్స్ కోసం జిందగీ ఈ ట్రీట్ ఇస్తోంది..!

seethafal-rabdi

సీతాఫల్ రబ్డీ


కావలసిన పదార్థాలు :
పాలు : 1/2 కప్పులు, కుంకుమ పువ్వు : 2 రెక్కలు
బాదంపప్పు పౌడర్ : 2 స్పూన్లు, మిల్క్ పౌడర్ : 1స్పూన్
చక్కెర : 2 స్పూన్లు, సీతాఫల్ పల్ప్ : అరకప్పు

తయారీ :
పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో చిక్కని పాలు పోసి సన్నని మంట మీద వేడిచేయాలి. తర్వాత అందులో చక్కెర కలిపి పాలు సగం అయ్యే వరకూ మరిగించాలి. పాలు చిక్కగా అయ్యాక మిల్క్ పౌడర్ వేసి కలిపి దించేసి ఆ మిశ్రమాన్ని చల్లార్చాలి. అందులో బాదం పౌడర్, సీతాఫలం గుజ్జు, కుంకుమ పువ్వు వేసి కలిపి మూడు నాలుగు గంటలు ఫ్రిజ్‌లో పెడితే టేస్టీ సీతాఫల్ రబ్డీ రెడీ!

basundi

సీతాఫల్ బాసుంది


కావలసిన పదార్థాలు :
పాలు : 2 లీటర్లు, మిల్క్ మెయిడ్ : 1/2 కప్పు
సీతాఫల్ పల్ప్ : ఒక కప్పు, చక్కెర : 1/4 కప్పు
ఇలాయిచీ పౌడర్ : తగినంత

తయారీ : ఒక గిన్నెలో సీతాఫల్ పల్ప్, కొంచెం చక్కెర వేసి గంట వరకు ఫ్రిజ్‌లో పెట్టాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో పాలు పోసి సన్నని మంట మీద సగం అయ్యే వరకు మరిగించాలి. తర్వాత ఆ పాలకు మిల్క్ మెయిడ్, చక్కెర, ఇలాయిచీ పొడి, డ్రైఫూడ్స్, కొద్దిగా కుంకుమపూవు వేసి పొయ్యి కట్టేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత కూల్ చేసిన సీతాఫలం గుజ్జును కలిపి ఫ్రిజ్‌లో ఓ అరగంట పాటు ఉంచి సర్వ్ చేయాలి.

Sitaphal-Outdoor-Hires

సీతాఫల్ ఐస్‌క్రీం


కావలసిన పదార్థాలు :
సీతాఫలాలు : నాలుగు
పాలు : 2 కప్పులు
మేరీ బిస్కెట్స్ : 5
చక్కెర : 3 స్పూన్లు

తయారీ : సీతాఫలం పండ్లను కడిగి వాటి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. మిక్సర్ జార్‌లో చిక్కటి పాలు, మేరీ బిస్కెట్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమానికి చక్కెర, సీతాఫలం గుజ్జు కలిపి మళ్లీ ఒకసారి గ్రైండ్ చేయాలి. అప్పుడు చిక్కటి క్రీమ్ తయారవుతుంది. దాన్ని రెండు గంటలు డీప్ కూలింగ్ చేసి బయటకి తీసి తర్వాత మళ్లీ రెండు సార్లు ైబ్లెండ్ చేసి ఫ్రిజ్‌లో పెడితే చల్లచల్లని సీతాఫల్ ఐస్‌క్రీం రెడీ!

phirini

సీతాఫల్ ఫిర్నీ


కావలసిన పదార్థాలు :
పాలు : 1/2 కప్పులు
బాస్మతి రైస్ : రెండు స్పూన్లు
చక్కెర పొడి : నాలుగు స్పూన్లు
ఇలాయిచి పౌడర్ : తగినంత
సీతాఫలం గుజ్జు : 3/4 కప్పులు

తయారీ :
బియ్యాన్ని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఒక గిన్నెలో ఒక కప్పు పాలు, బియ్యంపిండి వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఓవెన్‌లో నాలుగు నిమిషాలు బేక్ చేయాలి. తర్వాత దాన్ని ఓవెన్ నుంచి తీసేసి, పాలు కలిపి రెండు నిమిషాలు ఓవెన్ హైలో ఉంచి వేడి చేయాలి. తర్వాత దాన్ని తీసి కూల్ అయ్యాక చక్కెర, సీతాఫలం గుజ్జు, ఇలాయిచీ పౌడర్ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలిపి ఫ్రిజ్‌లో పెట్టి కూల్ అయ్యాక తింటే టేస్టీ సీతాఫల్ ఫిర్నీ రెడీ.

3550
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles