రాలే జుట్టుకు ఇక చెక్


Tue,March 29, 2016 11:20 PM

వెంట్రుక జీవితకాలం 2 నుంచి 3 సంవత్సరాలు. ప్రతి వెంట్రుక దాదాపు 1 సెంటీమీటరు పెరుగుతుంది. 90 శాతం వెంట్రుకలు తల పైన ఏ సమయంలోనైనా పెరగవచ్చు. మిగిలిన 10 శాతం వెంట్రుకలు ఏ సమయంలోనైనా పెరుగుతాయి. 3 నుంచి 4 నెలల తరువాత వెంట్రుకలు రాలడం, కొత్త వెంట్రుకలు వాటి స్థానంలో రావడం జరుగుతుంది. రోజూ జుట్టు రాలడమనేది సాధారణ విషయమే. కానీ కొంతమందికి ఒకేరోజులో చాలా జుట్టు రాలడం జరుగుతుంది (మామూలు కంటే ఎక్కువ). ఇది స్త్రీలలో, పురుషుల్లో, పిల్లల్లో కూడా ఉంటుంది.

కారణాలు


జుట్టు రాలడానికి చాలా కారణాలున్నాయి. ఉదాహరణకి అనారోగ్యంతో బాధపడినవారికి 3 లేదా 4 నెలల తరువాత, మేజర్ సర్జరీ జరిగిన తరువాత జుట్టు రాలడం అధికంగా ఉంటుంది. జుట్టు రాలడమనేది ఎక్కువగా ఒత్తిడి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇది తాత్కాలికమే. హార్మోనుల్లో మార్పుల వలన కూడా జుట్టు రాలడం జరుగుతుంది. థైరాయిడ్ సమస్యల వలన కూడా జుట్టు రాలడం జరుగుతుంది. థైరాయిడ్ చికిత్స వలన జుట్టు రాలడాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. స్త్రీ, పురుషుల లైంగిక హార్మోన్లయిన ఈస్ట్రోజన్, ఆండ్రోజన్‌లలో మార్పుల వలన జుట్టు రాలుతుంది. హార్మోనులలోని మార్పులను సరిచేయడం ద్వారా జుట్టు రాలడాన్ని ఆపవచ్చు.
బిడ్డ పుట్టిన 3 నెలల తరువాత స్త్రీలలో జుట్టు రాలడం జరుగుతుంది.

ఇది ముఖ్యంగా హార్మోనులతో సంబంధాన్ని కలిగివుంటుంది. గర్భధారణ సమయంలో హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువ అవడం వలన జుట్టు రాలుతుంది. తిరిగి హార్మోన్ల ఉత్పత్తి సాధారణ స్థాయికి రావడంతో జుట్టు రాలడం ఆగిపోయి తిరిగి పెరగడం ప్రారంభమవుతుంది. కొన్ని మందుల వాడకం వలన కూడా జుట్టురాలవచ్చు. ఈ మందుల వాడకం ఆపేసిన తరువాత తిరిగి జుటుట పెరగడం ప్రారంభమవుతుంది. గౌట్, బీపీ, గుండెకు సంబంధించిన మందులు, విటమిన్ ఎ ఎక్కువగా తీసుకున్నా, యాంటీడిప్రెసెంట్స్ అధికంగా వాడినా జుట్టు రాలవచ్చు. ఫంగల్ ఇన్‌పెక్షన్ల వల్ల పిల్లల్లో జుట్టు రాలుతుంది. యాంటి ఫంగల్ మందులు వాడి ఇన్‌ఫెక్షన్లను తగ్గించవచ్చు. ల్యూపస్, డయాబెటిస్ వ్యాధుల వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఇది వ్యాధి లక్షణం. వ్యాధికి చికిత్స చేస్తే జుట్టు రాలే సమస్యా తగ్గుతుంది. కొన్ని రకాల హెయిర్ ైస్టెల్స్ వలన, చికిత్సల వల్ల జుట్టు రాలవచ్చు. స్కారింగ్ వల్లయితే శాశ్వతంగా జుట్టు రాలిపోతుంది.

బట్టతల


సాధారణంగా కనిపించే బట్టతలను ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అంటారు. ఇది పురుషుల్లో జుట్టు రాలడానికి గల ముఖ్య కారణం. ఈ మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్‌లో హెయిర్ లైన్ వెనుకకు జరగడమే కాకుండా బట్టతల కూడా వస్తుంది. ఇటువంటి బట్టతల స్త్రీలలో కూడా వస్తుంది. దీన్ని ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటారు. దీనివల్ల తలపై జుట్టు పలుచబడుతుంది.

చికిత్స


ఆహారపు అలవాట్లు, వాడుతున్న మందులు, స్త్రీలలో నెలసరి, గర్భం, మెనోపాజ్ లాంటి స్థితులను బట్టి చికిత్స ఉంటుంది. రక్తపరీక్ష, బయాప్సీ కూడా అవసరం రావచ్చు. వాటి ఫలితాలను బట్టి కూడా చికిత్స ఉంటుంది.
doctor

రాలడం ఆపొచ్చా?


సమస్యకి మూలకారణాన్ని తొలగిస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది. మినాక్సిడిల్ అనే మందును తల మీద రాయడం వల్ల జుట్టు రాలడాన్ని ఆపవచ్చు. ఇది స్త్రీ, పురుషులెవరైనా వాడవచ్చు. ఫిన్టారైడ్ అనే మందు మాత్రల రూపంలో లభిస్తుంది. ఇది పురుషులు వాడదగినది. దీనిద్వారా జుట్టు పెరగడానికి 6 సంవత్సరాల కాలం పడుతుంది. హోమియోపతి వైద్య విధానం ద్వారా ఫ్లోరిక్ యాసిడ్, లైకో, సెపియా, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, కార్బో వెజ్ లాంటి మందులను ఉపయోగించి జట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.

2149
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles