రాత్రి భోజనంతో క్యాన్సర్ ముప్పు!


Tue,August 21, 2018 01:16 AM

Cancer
రాత్రి భోజనం అని.. రాత్రిపూట ఎప్పుడో ఒకసారి తినేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? అయితే మీరు రిస్క్‌లో పడ్డట్టే. అది మామూలు రిస్క్ కాదు. రాత్రి భోజనంలో సరైన సమయ పాలన లేకపోతే క్యాన్సర్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు.


రాత్రి భోజనం ఎంత తొందరగా తింటే అంత ఆరోగ్యంగా ఉంటారని పరిశోధకులు చెప్తున్నారు. పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు భోజనం చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటుందట. డిన్నర్ సమయాన్ని బట్టి క్యాన్సర్ రిస్క్ అనేది ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. తాజాగా స్పానిష్ పరిశోధకులు రాత్రిపూట భోజనం.. ప్రభావం అనే అంశంపై అధ్యయనం చేశారు. 621 మంది ప్రొస్టేట్ క్యాన్సర్ పేషెంట్లను, 1205 మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లను ఈ సందర్భంగా పరిశీలించారు. వీరిలో రాత్రి 9 గంటలకు ముందే భోజనం చేసినవాళ్లలో 20% క్యాన్సర్ రిస్క్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రాత్రి 10 గంటల తర్వాత భోజనం చేసేవారిలో దీనికి రెట్టింపు స్థాయిలో క్యాన్సర్ రిస్క్ ఉన్నట్లు తెలిపారు. ఆలస్యంగా తినడం.. నిద్రపోవడం.. ఆలస్యంగా నిద్ర లేవడం వీటికి అలవాటు పడటంతో క్యాన్సర్‌కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

53
Tags

More News

VIRAL NEWS

Featured Articles