రాత్రి డ్యూటీ చేటు


Mon,February 18, 2019 11:32 PM

Night-Shift
పగటి డ్యూటీవారితో పోలిస్తే నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే వారి డీఎన్‌ఏలో చాలా ఎక్కువగా మార్పులు వస్తుంటాయని హాంకాంగ్ శాస్త్రవేత్తలు అంటున్నారు. గత కొంతకాలంగా ఈ అంశంపై అధ్యయనం చేస్తున్న వీరు రాత్రివేళల్లో పనుల ద్వారా జన్యు మార్పులను నిర్ధారించామని అన్నారు.

రాత్రివేళల్లో ఉద్యోగం చేయడం వల్ల గుండెజబ్బులు, నాడీసంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వీరు అంటున్నారు. వారి డీఎన్‌ఏలో మార్పులు మామూలు వారితో పోలిస్తే 30 శాతం వరకూ ఎక్కువగా ఉంటాయి. దీనికి నిద్రలేమి కూడా తోడైతే డీఎన్‌ఏ నష్టం ఇంకో 25 శాతం ఎక్కువగా ఉంటుంది. డీఎన్‌ఏలో తరచూ ఒకటి అరా మార్పులు జరగడం మామూలే అయినప్పటికీ రెండుగా విడిపోయేటప్పుడు ఈ మార్పులు కొనసాగడం, మరమ్మతులకు లొంగకపోవడం వల్ల సమస్యలు వస్తూంటాయి. రాత్రిపూట పనిచేసే వారితోపాటు మూడురోజులపాటు సరైన నిద్ర లేని వారి రక్తాన్ని వారు విశ్లేషించారు.

351
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles