రాజ్యాంగమే రక్షణ !

Mon,July 17, 2017 12:53 AM

ఢిల్లీ మురికివాడలకు చెందిన మహిళల్లో చైతన్యం వెల్లివిరుస్తున్నది. సమస్యల్లో ఉన్న తమ బస్తీలను, కాలనీలను అంతా కలిసికట్టుగా బాగు చేసుకుంటున్నారు. ఇష్టానుసారం వ్యవహరించే అధికారుల ఆట కట్టిస్తున్నారు. అదెలాగంటే..?
delhislumladies
ఢిల్లీలోని సావ్‌దా గెర్వా కాలనీకి చెందిన మహిళలు చైతన్యవంతులయ్యారు. కొన్నాళ్ల క్రితం వరకు వాళ్ల కాలనీలో కనీస వసతులుండేవి కావు. అలాంటి వారికి మార్గ్ స్వచ్ఛంద సంస్థ రాజ్యాంగం కల్పించిన హక్కులను గుర్తుచేసింది. శిక్షణా తరగతుల్లో వివరించి చెప్పారు. ఆర్టీఐ యాక్ట్‌పై అవగాహన పెంచుకున్న మహిళలు.. పూర్తి వివరాలు సేకరించారు. అధికారులను నిలదీశారు. అంతేకాదు, కాలనీలో శానిటరీ, రోడ్ల మరమ్మతులు, రవాణా సౌకర్యం.. ఇలా ప్రతీ అంశంలో తమకు దక్కాల్సిన వాటాను సాధించుకుంటున్నారు. నిర్ణీత సమయంలో పూర్తి కావాల్సిన పనులు ఆలస్యమైతే.. ఆర్టీఐ సమాచారాన్ని చూపించి అధికారులను నిలదీస్తున్నారు. దీంతో ఒకప్పటి సావ్‌దా గెర్వా కాలనీకి, ఇప్పటి కాలనీకి ఎంతో తేడా కనిపిస్తున్నది.

80
Tags

More News