యూట్యూబ్ మ్యూజిక్ టిప్స్!


Wed,September 19, 2018 01:05 AM

యూట్యూబ్ అనేది ఎన్నో వీడియోలను తనలో దాచుకునే మహా సముద్రం. అందులో అంత సులువుగా మనకు కావాల్సిన సంగీతాన్ని పొందే అవకాశం కలుగకపోవచ్చు. అందుకే ఈ చిట్కాలు పాటించండి.
yutube
-యూట్యూబ్‌లో మనకు కావాల్సిన పాటను లిరిక్స్‌తో సహా వినాలనుకుంటే గూగుల్‌సెర్చ్ బాక్స్‌లో వెతకాలి. యూట్యూబ్ లింక్ తొందరగా దొరుకుతుంది.
-గూగుల్ సెర్చ్ బాక్స్‌లో మనం కోరుకున్న మ్యూజిక్ లిరిక్స్ దొరకకపోతే.. find music by lyrics అనే టూల్ ద్వారా ప్రయత్నించవచ్చు.
-మ్యూజిక్ ఐడెంటిఫికేషన్స్ యాప్స్ ద్వారా కూడా కోరుకున్న సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.
-సౌండ్ హౌండ్, షాజమ్ వంటి మ్యూజిక్ ఐడెంటిఫికేషన్స్ యాప్స్ ద్వారా మ్యూజిక్ లేదా పాటలను ఈజీగా గుర్తించవచ్చు.
-ఇంటర్నెట్‌లో ఏదైనా నచ్చిన పాటలను పొందాలంటే ఏదైనా మ్యూజిక్ లేదా పాటకు సంబంధించి వచ్చిన కామెంట్స్ సెక్షన్‌లో పోస్ట్ అయిన కామెంట్స్ ద్వారా కూడా పాటను పొందవచ్చు.
-ఒకవేళ కామెంట్స్ ఎక్కువగా ఉంటే ctrl+F కమాండ్‌ను ఉపయోగించి, అవసరమయ్యే కామెంట్‌ను సెర్చ్ చేసి పాట వెతుక్కోవచ్చు.

938
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles