యువ రాజకీయం కోసం!


Sat,December 15, 2018 12:33 AM

యువత రాజకీయాల్లోకి రావాలని, అప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని రాజకీయ పార్టీల నేతలు చెబుతుంతారు. అయితే నిస్వార్థంగా యువతను రాజకీయాల్లోకి మాత్రం ఆహ్వానించరు. అందుకే యంగ్ ఇండియా ఫౌండేషన్ కొత్త ప్రతిపాదనతో యువతను రాజకీయాల్లోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నది.
young-india-foundation
భారతదేశ జనాభాలో అత్యధిక శాతం యువతే ఉన్నది. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు 25యేండ్ల వయసు కలిగిన వారు అర్హులు. అయితే, మన దేశంలోని ఎంపీ వయసు సగటున 58 యేండ్ల పైనే. ఇంకో విషయం ఏంటంటే.. దేశంలో 25 నుంచి 27 యేండ్ల వయసున్న వారు 670 మిలియన్ల మంది ఉన్నారు. అందుకే యువత రాజకీయాల్లోకి వస్తే దేశం ప్రగతిలో దూసుకుపోతుందని భావిస్తున్నారు ఈ ఫౌండేషన్ సభ్యులు. ఇందుకోసం 1989లో వయోజన ఓటు హక్కును 21 నుంచి 18 యేండ్లకు కుదించినట్లుగానే.. ఎన్నికల్లో పోటీ చేసే వయసును 25 నుంచి 21 యేండ్లకు కుదించాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా మరింత మంది యువకులను రాజకీయశక్తిగా మార్చేందుకు అవకాశం ఏర్పడుతుందని యంగ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుధాన్షు కౌశిక్ అంటున్నాడు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా యువకులను రాజకీయాల్లోకి తీసుకువచ్చే విధంగా అవగాహన కల్పిస్తున్నాడు. ఎన్నికల్లో పోటీ చేసే యువ అభ్యర్థి నామినేషన్ దగ్గర నుంచి మ్యానిఫెస్టో రూపకల్పన, చట్టపరమైన సలహాలు, సూచనలు, ఎన్నికల ప్రచారం వంటి అంశాల్లో ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేసేవారికే ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఆ సంస్థ పోరాడుతున్నది. ఈ బృందం జమ్ముకశ్మీర్‌లోని బరిదర్హల్ పంచాయతీ సర్పంచ్‌గా 23 యేండ్ల అబిదా అనే యువతితో పోటీ చేయించింది. మొదటి సారిగా పోటీచేసి ఎక్కువ ఓట్లను పొందగలిగింది. రాజకీయాల్లోకి యువశక్తిని ఆహ్వానించేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నది.

329
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles