యుద్ధవిద్యల అజిత


Thu,August 9, 2018 11:06 PM

ఐదుగురిలో నంబర్‌వన్ రావడం ఈజీనే. 578 మందిలో నంబర్ వన్ రావడమే గొప్ప విషయం. పలు రకాల యుద్ధ విద్యలు నేర్చుకొని కేరళ మహిళా పోలీస్ బెటాలియన్ నంబర్ వన్‌గా నిలిచిన అజిత గురించిన విశేషాలు..
Ajitha
కేరళకు చెందిన పరమేశ్వరన్, రాజమ్మ దంపతుల బిడ్డ అజిత. చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. మామయ్య మహీంద్రన్ దగ్గర పెరిగింది. కూలీ పనులు చేసి వచ్చిన డబ్బుతో అజితను చదివించేవాడు మామయ్య మహీంద్రన్. చిన్నప్పటి నుంచే ఎన్నో అడ్డుంకులను ఎదుర్కొని చదువును కొనసాగించింది. తల్లిదండ్రులు లేని లోటు లేకుండా పెంచాడు మామయ్య. ఏ రోజు దిగులుపడకుండా కష్టపడి చదివింది. ఉన్నత విద్య అనంతరం పోలీస్ ఎంట్రన్స్ పరీక్ష రాసింది. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది. ఉద్యోగమొచ్చింది. కేరళ మహిళా పోలీస్ బెటాలియన్‌లో చేరింది. ఈతకొట్టడం, సైబర్ నేరాలను ఎలా అడ్డుకోవాలి అన్న విషయాలను తొమ్మిది నెలల శిక్షణలో నేర్చుకున్నది. పురుష పోలీసులతో సమానంగా ఏకే-47 వాడగల సమర్థురాలు అజిత. ఎలాంటి ఆపద వచ్చినా ఎదుర్కోగల ధైర్యవంతురాలు. శిక్షణా సమయంలో అక్కడున్న 578 మంది అమ్మాయిలను వెనక్కి నెట్టి అజిత మొదటి స్థానంలో నిలిచింది. అజితకు కలరిపయట్టు, కరాటే, ఫైర్, వెపెన్స్, ఈతకొట్టడం, యోగా, డ్రైవింగ్, కంప్యూటర్, సాఫ్ట్ స్కిల్స్, అటవీ కార్యకలాపాలు, ఆపదల నుంచి మహిళలను, పిల్లలను కాపాడటంలాంటి అంశాల్లో ఎక్కువ తర్ఫీదునిచ్చారు. జూలై 31న కేరళ రాష్ట్ర మొదటి మహిళా పోలీస్ బెటాలియన్ శిక్షణ పూర్తయింది. పరేడ్ జరిగింది. ఇందులో అజితకు ఘనంగా సన్మానించారు. పనంగాడ్‌లో నివాసముంటున్న కేటీ అజిత అందరికెల్లా మంచి ప్రతిభ చూపించడం వల్ల ఉత్తమ క్యాడెట్ ట్రోఫీని కేరళ ముఖ్యమంత్రి విజయన్ చేతుల మీదుగా అందుకున్నది.

158
Tags

More News

VIRAL NEWS