యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఈక్విటీ హైబ్రిడ్ స్కీమ్


Sat,July 21, 2018 01:33 AM

DY
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ హైబ్రిడ్ స్కీమ్ ఎన్‌ఎఫ్‌వోను జారీ చేసింది. ఈ ఎన్‌ఎఫ్‌వో ద్వారా రూ. 1500 కోట్లను సమీకరించాలని సంకల్పించింది. పరమితమైన రిస్క్‌తో పెట్టుబడి వృద్ధి చెందాలనుకునే ఇన్వెస్టర్ల కోసం ఈ స్కీమ్‌ను రూపొందించినట్టు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. ఈ ఫండ్ ద్వారా సమీకరించే నిధుల్లో 60-80 శాతం ఈక్విటీలలో, 20-35 శాతం వరకు రుణ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టనుంది. మల్టీ క్యాప్ బాటమ్ అప్ వ్యూహాన్ని షేర్ల ఎంపికలో పాటించనున్నది. అధిక భాగం లార్జ్‌క్యాప్ షేర్లలోనూ, 30 శాతం వరకూ మిడ్‌క్యాప్ షేర్లలో మదుపు చేయనున్నది. ఇందులో డివిడెండ్, గ్రోత్ ఆప్షన్లు వున్నాయి. ఆగస్టు 3వరకు ఈ ఎన్‌ఎఫ్‌వో సబ్‌స్ర్కైబ్ చేయవచ్చు.

130
Tags

More News

VIRAL NEWS