మోడలింగ్‌లో మెరిక.. ఈ గ్రేస్!


Sat,August 25, 2018 10:57 PM

down-sindrome-girl
ఈ పాపకు పుట్టుకతోనే డౌన్ సిండ్రోమ్ వచ్చింది. దీంతో ఎప్పుడు చూసినా చిన్నపిల్లలాగే కనిపిస్తుంటుంది. అలా కనిపించడంతో ఒక రకంగా శాపమే అయినా.. ఈ వండర్ గాళ్ మాత్రం దానిని వరంగా మలుచుకున్నది. తనకు ఇష్టమైన కిడ్స్ మోడలింగ్‌ను ఎంచుకొని.. విజయవంతంగా దూసుకెళ్తున్నది.

డౌన్ సిండ్రోమ్.. ఈ వ్యాధి సోకిన పిల్లలకు శారీరక, మానసిక ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. వయసు పెరిగినా వారు చిన్నవారిగానే కనిపిస్తారు. వేలల్లో ఒకరికి మాత్రమే ఈ గ్రేస్ ఇసాబెల్లా వార్టన్‌లాగే తెలివితేటలు ఉంటాయి. ఇంతకీ ఏంటి గ్రేస్ గొప్పతనమని అనుకుంటున్నారా? ఏడేళ్ల వయసున్న గ్రేస్‌కు మోడలింగ్‌లో చాలా పేరు సంపాదించింది. సోషల్ మీడియాలో వేలల్లో అభిమానులను సొంతం చేసుకున్నది. గతంలో డిస్నీ, సీబీబీఎస్‌లలో మోడలింగ్ విభాగంలో పనిచేసింది గ్రేస్. తనకు ఇష్టమైన మోడలింగ్‌లో పనిచేసేందుకు పలు కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నది. బిహైండ్ ది స్కార్స్‌లో నటించిన గ్రేస్‌కు ర్యాంప్‌పై నడువడమంటే చాలా ఇష్టం. కెమెరా ముందు తనవైన హావభావాలు పలికించడంలో దిట్ట. ఇక ఫొటోలకైతే ఎన్ని రకాలుగా ఫోజులిస్తుంటుందో. కెమెరా ముందుకు వచ్చిన ప్రతిసారీ తాను ఏదైనా చేయగలననే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెబుతున్నది ఏడేండ్ల గ్రేస్. జీవితాంతం వేధించే డౌన్ సిండ్రోం బాధిస్తున్నా.. తనలో ఇంతలా ధైర్యం పెరుగడానికి కారణం తల్లిదండ్రులు చెరిల్, జాన్ వార్టన్‌లేనని అంటున్నది. ఊహ తెలిసిన దగ్గర్నుంచి మోడలింగ్‌లోనే రాణిస్తుండడంతో ఆమె చదివే పాఠశాలలోని ప్రముఖుల సరసన నిలిచింది. ఇలా తనకు నచ్చిన పనిలోనే ఆనందం, ఆదాయం వెతుక్కుంటూ.. వేలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నది ఈ చిన్నారి గ్రేస్.

530
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles