మోకాళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారం సాధ్యమే..


Thu,September 28, 2017 01:44 AM

క్రాంతి రాజం అనే 48 సంవత్సరాల వ్యక్తి మోకాళ్ల నొప్పుల సమస్యతో మా దగ్గరకు వచ్చాడు. మొదట్లో అతడు వ్యవసాయం మాత్రమే చేసేవాడు, కానీ తర్వాత కాలంలో వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా మొదలు పెట్టాడు. రెండు సంవత్సరాల పాటు విజయవంతంగా రెండు పనులను చేసుకోగలిగాడు. కానీ, రెండేండ్ల తర్వాత మోకాళ్లనొప్పుల సమస్య అతడిని బాధించడం మొదలు పెట్టింది. కొద్దికాలం పాటు పెయిన్ కిల్లర్లు వాడితే అప్పటికి నొప్పి తగ్గిపోయేది. కానీ రోజురోజుకీ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. లేచి నాలుగు అడుగులు నడువడం కూడా కష్టంగా మారింది. నా పనులన్నీ వెనుకబడి పోయాయి. వ్యవసాయం, వ్యాపారం అన్ని కుంటుబడి పోయాయి. మీరందించే చికిత్సతో తిరిగి మునుపటిలా జీవితం సాగించగలుగుతానా? అని అతడు మమ్మల్ని అడిగాడు.
Pane

వివరాల్లోకి..

అతడి జీవన శైలిని గమనిస్తే సహజ జీవన విధానానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. వేళకు భోంచెయ్యడం, నిద్రపోవడం వంటివి చాలాకాలంగా అతడి దిన చర్యలో లేదు. ఫలితంగా తీసుకుంటున్న ఆహారం పూర్తిస్థాయిలో జీర్ణం కావడం లేదు. విసర్జన క్రియ కూడా సరిగ్గా ఉండడం లేదు. ఈ వివరాలను బట్టి అతడి శరీరంలో వ్యర్థాలు పేరుకు పోయినట్టు గుర్తించాము. సంధి వాతంతో అతడు విపరీతంగా బాధపడుతున్నట్టు అర్థం అయ్యింది. ఆయుర్వేద వైద్య విధానంలో వాటన్నింటినీ తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావడం సాధ్యమేనని అతడికి కావాల్సిన భరోసా ఇచ్చాం.

ఆయుర్వేద చికిత్స

మోకాళ్ల నొప్పికి మూలం సాధారణంగా జీర్ణవ్యవస్థలో ఉంటుంది. ఆమ్లకారకమైన ఈ సమస్యను తొలగించకుండా ఏ రకమైన వైద్యం చేసినా సమస్య తాత్కాలికంగా తొలగి పోతుంది తప్ప శాశ్వత పరిష్కారం కాదు. అందుకే ఆయుర్వేదం వాతాహర చికిత్సలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఆ తర్వాత అరిగి పోయిన కార్టిలేజ్‌ను తిరిగి వృద్ధి చెయ్యడం మీద దృష్టి సారిస్తుంది. అందుకు గాను ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేక ఔషధయుక్త తైలాలతో చేసే చికిత్సతో అరిగిపోయిన భాగాలన్నీ తిరిగి వృద్ధి చెందుతాయి. వాస్తవానికి కార్టిలేజ్‌ను పునరుద్ధరించే శక్తి ఆయుర్వేద తైలాలకు ఉంటుంది. జానువస్తి చికిత్సలు ఏవరైనా చెయ్యవచ్చు. కానీ ఆ సమయంలో కీళ్లలోకి పంపే తైలాల పాత్రే ఇక్కడ కీలకం. ఆ తైలం ఎంతో ప్రత్యేకమైనది. ప్రత్యేక తైలాలు, ఔషధాలతో మోకాళ్ల నొప్పులు సమూలంగా తొలగిపోతాయి. ఆయుర్వేదం సూచించిన చికిత్సలన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటే మోకాళ్ల నొప్పులు తప్పకుండా తగ్గిపోతాయి. క్రాంతి రాజం విషయంలో కూడా అలాగే జరిగింది. ఆరు మాసాల చికిత్సతో అతడి సమస్య పూర్తిగా తొలగిపోయింది.
DrTL

466
Tags

More News

VIRAL NEWS