మోకాళ్ల నొప్పులకు జానువస్తి


Tue,November 21, 2017 03:07 AM

మోకాళ్ల నొప్పుల కారణాల గురించి చెప్పుకోవడానికి ముందు మోకాలి అంతర్భాగాల గురించిన ఒక అవగాహనకు రావడం చాలా అవసరం. అప్పుడే మోకాళ్ల నొప్పుల కారణాలను అర్థం చేసుకోవడం సులువవుతుంది. మోకాలు అనేది కీలు. ఈ కీళ్లో కండరాల భాగం, ఎముకల భాగం అనేవి ఇందులోని ప్రధాన అంతర్భాగాలవుతాయి. మొత్తంగా చూస్తే సప్తధాతువులూ భాగమవుతాయి. అందువల్ల ఏ ధాతువులో లోపం ఉంటే ఆ లోపానికి చికిత్స ద్వారా పూరించాల్సి ఉంటుంది. అప్పుడే మోకాళ్ల నొప్పులను సమూలంగా తొలగించడం సాధ్యమవుతుంది.
Knees-pain
మోకాళ్ల నొప్పులు అనే మాట మీద ఈ నాలుగు విషయాల గురించి ఆలోచించాల్సి వస్తోంది. ఎముకలకు అంటే అస్థిధాతువుకు సంబంధించిన లోపాలు బాధను కలిగిస్తాయి. లోపాలు వ్యధను కలిగిస్తాయి కాబట్టి వ్యాధి అంటారు. మోకాళ్లనొప్పులకు సంబంధించినంత వరకు అస్థిధాతువుకు సంబంధించిన లోపమైనా కావచ్చు. అవన్ని పోగా ఒక్కోసారి వీటికి దెబ్బలు తగలడం వల్ల కూడా కావచ్చు. ఈ గాయాల్ని కూడా అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. వాటిలో ప్రధానంగా ఏమిటంటే ఒక సాధారణ బరువుతో ఉండాల్సిన వ్యక్తి సగటు కంటే ఎక్కువ బరువును మోయాల్సి వస్తుంది. ఆ బరువునంతా ఈ మోకాళ్లే మోస్తాయి. బరువు ఎక్కువైనప్పుడు రెండు ఎముకల మధ్య ఉండే మృదులాస్తి గాయపడడమో లేదా అరిగిపోవడమో జరుగవచ్చు. మొదట్లో గాయమైనపుడు స్రావాలు ఎక్కువ కావచ్చు. ఏ ధాతువైనా ఏ స్రావాలైనా అవసరానికి మించి ఉంటే అది వ్యాధే. అప్పుడు కీలు చుట్టూ ఒక వాపు ఏర్పడుతుంది. గాయమైనపుడు గాయం రక్తనాళాలకు సంబంధం ఉంది కాబట్టి రక్తనాళాల నుంచి కొన్ని అదనపు స్రావాలు ఈ కీలు మధ్యలోకి స్రవిస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ వాపులా తయారవుతుంది. లేదా ఒక్కోసారి అక్కడ స్రావాలు ఏర్పడకపోవచ్చు.

జాను వస్తి తో చికిత్స


కీళ్ల నొప్పులను వాతం పేరుతో చెప్పినప్పటికీ నొప్పే ప్రధానంగా ఉంటున్నప్పటికీ మిగతా లక్షణాల్ని కూడా ప్రాతిపదికగా తీసుకొని చికిత్స చెయ్యాల్సి ఉంటుంది. కీళ్లు కదలకుండా ఉండిపోయే పరిమాణం కావడం చేత దీనికి సంధి శూల అని అంటారు. అలా కదలకుండా ఉండిపోవడానికి కారణమేమిటి? ధాతువులు క్షీణించిపోవడమే అందుకు కారణం. వినియోగంలో లేని వాహనం తుప్పు పట్టినట్లు నొప్పుల కారణంగా చాలా కాలం అవయవాలను కదిలించకపోవడం వల్ల కీళ్లు బిగుసుకుపోతాయి. ఫలితంగా కీళ్లను మలుచుకోవడం గానీ, దగ్గరకు తీసుకోవడం గానీ, సాధ్యం కాకుండా పోతుంది. మౌలిక సమస్య జీవక్రియలకు సంబంధించింది అయినపుడు వాటికి సంబంధించిన చికిత్సేదీ లేకుండా కీలు మార్పిడి చేసి వదిలేస్తే ఆ నొప్పి ఇంకా కొనసాగే అవకాశం ఉంది. తైలాలకు వాతాన్ని తీసివేసే తత్వం ఉంటుంది కాబట్టి వాతాన్ని తొలగించే ఆకులతో లేదా మూలికలతో తైలాలతో అభ్యంగం చేయడం ద్వారా కూడా వారికి ఉపశమనాన్ని కలిగించవచ్చు. దీనికి తోడు మోకాలి చుట్టూ తైలాలను నొప్పి ఉన్న భాగంలో గుండ్రంగా ఒక ద్రోణి కట్టి ధారగా పోయడం ద్వారా అంటే జాను వస్తి చికిత్స చెయ్యడం ద్వారా కూడా నొప్పి నుంచి సంపూర్ణ విముక్తి లభిస్తుంది.
డా॥ టి.ఎల్. శ్రీనివాస్
సహజ ఆయుర్వేదిక్
హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్
9160 994 455
9160 994 456
హైదరాబాద్, హన్మకొండ,
రాజమండ్రి, నెల్లూరు, విజయవాడ,
అనంతపురం, జోగిపేట

510
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles