మోకాళ్ల నొప్పులకు ఆయుర్వేదమే పరిష్కారం


Thu,September 14, 2017 12:02 AM

Knee-Pain
నా పేరు ఎన్. ప్రకాశ్, నా వయసు 38 సంవత్సరాలు. నా 22వ ఏట నేను మార్కెటింగ్‌లో ప్రవేశించాను. అప్పట్లో నాకు బైక్ ఉండేది కాదు. అందువల్ల చాలా దూరం నడిచే వెళ్లే వాడిని. ఐదేళ్ల తర్వాత బైక్ కొనుక్కున్నాను. అప్పటి నుంచి తిరిగే దూరం కూడా చాలా పెరిగింది. పని ఒత్తిడి ఉండడం వల్ల రాత్రి పూట కూడా ఎక్కువ సమయం మేలుకొని ఉండేవాడిని. ఆకలిగా ఉన్నపుడు సమయం దొరక్కపోవడం వల్ల చాలాసార్లు ఆకలి చచ్చిపోయిన తర్వాతే భోజనం చెయ్యడానికి వీలు పడేది. ప్రయాణాల్లో చాలా సార్లు వాష్‌రూమ్‌లు అందుబాటులో లేక మూత్ర విసర్జన, ఒక్కోసారి మల విసర్జన కూడా వాయిదా వెయ్యాల్సి వచ్చేది. టార్గెట్‌ను చేరుకొవడానికి చాలా మానసిక ఒత్తిడి కూడా ఎదుర్కోవాల్సి ఉండేది. నాలుగేళ్ల క్రితం నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. నొప్పి చాలా ఎక్కువగా ఉన్నపుడు పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తూ ఇప్పటి వరకు కాలం వెల్లబుచ్చాను. కానీ ఆర్థోపెడిక్ డాక్టర్‌ను సంప్రదిస్తే సర్జరీ చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. కానీ నాకు సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేదు. ఈ మధ్య నాకు నరాలన్నీ చచ్చుబడిన భావన కలుగుతున్నది. నాకు ఇంత చిన్న వయసులో ఎందుకు మోకాళ్ల నొప్పులు వచ్చాయి. సర్జరీ లేకుండా తగ్గిపోయే అవకాశం లేదా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపాలి అని తన కథను వివరించారు.

అందుకు మేం అతడికి ఈ రకంగా సమాధానం చెప్పాం - మీకు మోకాళ్ల నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. తొలి రోజుల్లో మీరు కాలినడకన వెళ్లడం వల్ల వాతం ప్రకోపించి సంధి వాతం (ఆస్టియో ఆర్థరైటిస్) మొదలైంది. అందువల్ల మీ నాడి వ్యవస్థ కూడా దెబ్బతిన్నది.
నిద్రాహారాలు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా శరీరంలో వాతం ప్రకోపిస్తుంది. ఫలితంగా కీళ్లలో అరుగుదల మొదలవుతుంది. మానసిక ఒత్తిడి కూడా ఇందుకు తోడయ్యింది. ఇలా చాలా రకాల కారణాలతో మీలో వాతం ప్రకోపించి మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. ఏ రకమైన కారణంతో వాతం ప్రకోపించినా ఆయుర్వేదంలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. మీ సమస్యను సమూలంగా తొలిగించే బాధ్యత మాది అని చెప్పి ఆయన ఆమోదంతో చికిత్స ప్రారంభించాం.

వ్యర్థాలు తొలిగించాలి

పైన పేర్కొన్న కారణాలతో పాటు ఇతర కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో పరిశీలించాలి. ముఖ్యంగా ఈ సమస్య ఆహార లోపాల వల్ల అంటే ప్రొటీన్, కాల్షియం వంటి పోషకాల లోపం వల్లా? లేక ఇతర జీవక్రియల లోపం వల్లా? ఇతర ఖనిజ లవణాల లోపం వల్లా? అనేది నిర్ధారించుకున్నాం. తర్వాత కీళ్ల్లలో పేరుకుపోయిన వ్యర్థపదార్థాలను గుర్తించాం. సైనోవియల్ ఫ్లూయిడ్లు ఎక్కువగా ఉంటే అవి హానికారకంగా తయారవుతాయి. ఈ వ్యర్థాల వల్ల కీళ్లు పనిచెయ్యకుండా పోతే వాటిని తిరిగి పూర్వస్థితికి తీసుకు రావడమే ప్రధాన చికిత్స అవుతుంది. ఈ చికిత్సలన్నీ చేశాం.
srinivas

ఆయుర్వేద విశిష్టత

జీవక్రియల్లో ఏర్పడే లోపం ధాతుక్షయానికి దారి తీస్తుంది. మోకాలి నొప్పులు ధాతువులు క్షీణించినా రావచ్చు. ధాతువులు అతిగా పెరుగడం వల్ల కూడా రావచ్చు. ధాతువులు అతిగా పెరగడం వల్లనైనా రావచ్చు. అందుకే ధాతుశక్తిని పరీక్షించడం ముఖ్యమవుతుంది. అదే సమయంలో ధాతువులను పూర్వస్థితికి తేవడానికి ధాతువులను పరిపుష్టం చెయ్యడానికి అవసరమైన చికిత్సలన్నీ చెయ్యాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బాహ్య చికిత్సలు, అభ్యంతర చికిత్సలు ఉంటాయి. వీటితో పాటు మోకాలి నొప్పుల కోసం ప్రత్యేకంగా జానువస్తి చికిత్సలు చెయ్యాల్సి ఉంటుంది. ఇవన్నీ క్రమం తప్పకుండా చెయ్యడం వల్ల ఆరు మాసాల్లో అతని మోకాళ్ల నొప్పులు చాలా వరకు తగ్గిపోయాయి. దాదాపు ఏడాదిగా వృత్తికి దూరంగా ఉంటున్న ఆయన ఇప్పుడు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. నొప్పిలేని జీవితం ఎంతో ఉత్సాహంగా ఉందని ఆయన తన హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు.

589
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles