మోకాళ్ల నొప్పికి మంచి చికిత్స


Wed,December 2, 2015 12:44 AM

శరీర భారాన్ని మోసేవి మోకాళ్లే కాబట్టి సహజంగానే వీటి మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మోకాళ్ల మీద ఒత్తిడి పడినపుడు కార్టిలేజ్‌లోని నీరు ఎముకల మధ్యలోకి వెళ్తుంది. ఒత్తిడి తగ్గగానే తిరిగి కార్టిలేజ్‌లోకి వెళ్తుతుంది. అయితే కార్టిలేజ్ దెబ్బతిన్న వారిలో కార్టిలేజ్ నుంచి బయటకు వెళ్లిన నీరు తిరిగి కార్టిలేజ్‌లోకి చేరదు. ఫలితంగా కార్టిలేజ్ మరింత దెబ్బతింటుంది. సాధారణంగా 40 నుంచి 55 ఏళ్ల లోపు వారిలో కాండ్రోసైట్ కణజాలం ఉత్పత్తులు తగ్గుతాయి.

istock


దీని వల్ల దెబ్బతిన్న కార్టిలేజ్ తనను తాను చక్కబరుచుకోవడానికి అవసరమైన ప్రొటీన్ ఉత్పత్తి కాకపోవడంతో కొన్ని రకాల ఎంజైమలు పెరిగిపోయి కార్టిలేజ్ మరింత దెబ్బ తింటుంది. ఆర్థరైటిస్ సమస్య తీవ్రమవుతున్న క్రమంలో కీళ్లలో అసహజమై పెరుగుదల ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో సనివీయల్ ఫ్లూయిడ్‌లోని తెల్లరక్తకణాలు కీళ్లలోకి ప్రవేశించడంతో ఆస్టియోఫైట్స్ అనే బొడిపెలు పుట్టుకొస్తాయి. ఇవి కీళ్ల మధ్య రాపిడికి కారణమై కీళ్ల నొప్పులు తీవ్రమవుతాయి. పక్కనే ఉన్న రక్త నాళాలు ఉండడం వల్ల కార్టిలేజ్‌కు అందే రక్త ప్రసరణ అధికమవుతుంది. ఈ పరిణామాల వల్ల కీళ్లలో ఆస్టియోఫైట్స్ అనే బొడిపెలు ఏర్పడతాయి. సహజంగానే ఎముకకు సంబంధించిన కణజాలం ప్రతి 40 రోజులకు కొత్త కణజాలాలు ఏర్పడుతాయి. కాకపోతే ఆర్థరైటిస్ సమస్య ఉన్నపుడు ఎముక అరిగిన చోట కాకుండా వేరొక చోట ఏర్పడుతాయి. పైగా ఇవి అవసరానికి మించి ఏర్పడుతాయి. ఇలా అదనంగా పుట్టుకొచ్చిన ఆస్టియోఫైట్స్ వల్ల కీళ్ల మీద రాపిడిని పెంచుతాయి. ఫలితంగా కీళ్లు బిగుసుకుపోవడం, వాపు రావడం వంటి సమస్యలు మొదలవుతాయి. దీనికి తోడు కీళ్లలోని ద్రవం సన్నని రంద్రాల ద్వారా ఎముకల మధ్యకు వెళ్లి బొడిపెలుగా తయారవుతుంది. ఫలితంగా ఎముకలోని ట్రాబ్‌క్యూల్ అనే భాగం దెబ్బతింటుంది. ఈ క్రమంలో కీళ్లలోని జిగురు పదార్థం తగ్గిపోతూ కీళ్లు గట్టిపడి కదలికలో మరింత ఇబ్బంది ఏర్పడుతుంది. సరైన వైద్య చికిత్సలు అందకపోతే ఈ సమస్య ఏళ్ల తరబడి వేధిస్తూనే ఉంటుంది. అందుకే ఒకసారి ఈ సంధి వాతం సమస్య వస్తే జీవితకాలమంతా అది కొనసాగుతూనే ఉంటుందనే అభిప్రాయం చాలా మందిలో బలపడింది. కానీ, ఆయుర్వేదంలో సంధివాతాన్ని తొలగించే సమర్థవంతమైన చికిత్సలు ఉన్నాయి.

చికిత్సలు
ఆయుర్వేద విధానంలో సంధివాతాన్ని సమర్థ వంతంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా శమన, శోధన చికిత్సలు ఈ సమస్యను తొలగించడంలో బాగా ఉపయోగపడుతాయి. శమనం అంటే దోషాలను శమింపజేసే ఔషధ సేవనం ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ వాత ప్రధాన దోషం కనుక వాత శమనంగా ఆయుర్వేదంలో కషాయాలు, చూర్ణాలు, లేహ్యాలు, తైలాలు తోడ్పడుతాయి.

srinivassrao


అలాగే స్వేదకర్మ ద్వారా కీళ్లలోని పెళుసుదనాన్ని తొలగించి వాటిలో మృదుత్వాన్ని తీసుకురావచ్చు. అలాగే వస్తికర్మ, ధార, జానువస్తి లాంటి చికిత్సల ద్వారా అతి త్వరితంగా ఉపశమనం కలిగేలా చేయవచ్చు. అయితే అందరికీ ఒకే తరహా వైద్యం అనేది ఆయుర్వేదంలో ఉండదు. శరీర ధర్మాన్ని, వాత, పిత్త, కఫాల స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తుంది. అందువల్ల సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికి తిరగి నడిచే స్థితికి చేరుకుంటారు. ఈ వైద్యంతో మోకాళ్ల నొప్పులే కాదు శరీరంలోని సమస్త కీళ్ల బాధలు మటుమాయమవుతాయి. ఇది ఆయుర్వేదం మీకిచ్చే వాగ్ధానం.

2119
Tags

More News

VIRAL NEWS