మోకాళ్లు మొరాయిస్తుంటే.. గుళ్లూ..గోపురాలా?


Thu,January 25, 2018 02:00 AM

KneePain
ఎంత సేపూ ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి జీవన గమనం అంటే ఇదేనా ? ఎప్పుడో ఇప్పుడో ఎత్తైన కొండల మీదికి వెళ్లాలనిపిస్తుంది. ఆ కొండల మీదున్న గుడికి వెళ్లి, ఆ దివ్యదర్శనం చేసుకోవాలనిపిస్తుంది. ఎన్ని బైకులున్నా, ఎన్ని కార్లున్నా, అన్నీ గుట్టకింద ఆగిపోయేవే కదా! ఆ తర్వాత మాటేమిటి? ఏ ప్రత్యేక వసతులు ఉన్న చోట తప్ప మిగతా చోట్లంతా కాలి నడకే కదా శరణ్యం. అయితేనేమిటి? కొందరు అవలీలగా మెట్లెక్కి దిగేస్తుంటారు. కానీ, మోకాళ్ల నొప్పులు ఉన్న వారి మాటేమిటి? గుట్టదాకా వెళ్లి మాత్రం ఫలమేముంది అనుకుని, అసలు ప్రయాణం విరమించుకోవడమే కదా పరిష్కారం. ఎవరికైనా గుళ్లూ గోపురాలు సందర్శించాలన్న కోరిక ఉంటే సరిపోదు కదా! అందుకు అనుగుణంగా శరీరాన్ని నిలబెట్టుకోవాలి. పుట్టినప్పుడు దాదాపు అందరూ ఆరోగ్యంగానే ఉంటారు. అయితే పోనుపోను పరిస్థితి మారిపోతుంది. తీసుకునే ఆహార పానీయాల్లోని లోపాలు, వ్యాయామ లోపాలు, లేదా శారీరక మానసిక ఒత్తిళ్లు, నాడీ వ్యవస్థను, ఆ తర్వాత కండరాల్నీ, ఎముకల్నీ దెబ్బతీస్తాయి. అందులో భాగంగానే కీలు కీలూ దెబ్బ తినిపోతుంది. మిగతా కీళ్ల మాట ఎలా ఉన్నా, మోకాళ్ల కీళ్లు దెబ్బ తింటే జీవితాన్ని ఎవరో కూలదోసినట్లు అనిపిస్తుంది. లేచినా కూర్చున్నా భరించరాని నొప్పి బాధిస్తుంది. అయితే దీర్ఘకాలికమైన నొప్పి వాతాన్ని పెంచుతుంది. ఆ పెరిగిన వాతం నొప్పిని పెంచుతుంది. ఇదొక విషవలయం. అయితే ఈ వాతం పలురకాల వ్యాధులకు మూలమవుతుంది.

ఎందుకిలా?

ఒకటో రెండో కాదు, మోకాళ్లనొప్పులకు దారి తీసే కారణాలు అనేకం. కారణమేదైనా ప్రమాదాల్లో గాయపడే విషయాల్ని వదిలేస్తే మిగతా అన్నింటికీ మౌలికంగా వాతరోగాలే కారణం. కాకపోతే... వాతాలు అనేకం. అందువల్ల మోకాళ్లనొప్పుల వెనుక ఏ వాతం ఉందో తెలుసుకోవాలి. ఎన్ని రకాల వ్యాధులు కలిసి ఈ సమస్యకు కారణమయ్యాయో, సమస్య తీవ్రత ఎంతో.., రోగి స్థితి ఏమిటో ఇవన్నీ తెలుసుకుని వైద్య చికిత్సలు చేయాలి. వాటి గురించి అవసరమే లేదనుకునే ఆధునిక వైద్యుల వద్దకు వెళితే ఏమవుతుంది? ముందు పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ అంటూ కొంత కాలం గడిపి ఆధునిక వైద్యులు చివరికి సర్జరీకే సిద్ధం చేస్తారు. ప్రమాదాలు జరిగి ఎముకలు విరిగినప్పటి మాట వేరు. మిగతా అన్ని పరిస్థితుల్లో ఆయుర్వేద వైద్య చికిత్సలతో తగ్గే అవకాశం ఉంది. ఎలాంటప్పుడు సర్జరీలు ఎందుకు? వాస్తవానికి అరిగిన కీళ్లకు పునరుత్తేజాన్నిచ్చే ఆయుర్వేద ఔషధాలెన్నో ఇప్పుడు అందుబాటు లో ఉన్నాయి. అసలు దోషాన్ని స్పష్టంగా గుర్తించి తగిన ఔషధాలు ఇస్తే సర్జరీ లేకుండానే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

ఆయుర్వేద వైద్య విశిష్టత

మోకాళ్ల నొప్పులు అనగానే అది కేవలం ఎముకలకు సంబంధించిన అస్థి ధాతు సమస్యగానే అందరూ అనుకుంటారు. ప్రత్యక్షంగా కనిపించే కారణం అదే అయినా, మోకాళ్ల నొప్పులు రావడం వెనుక మొత్తం సప్తధాతువుల సమస్యలు ఉంటాయి. అందుకే విడిగా ఒక్క అస్థిదాతువుకు చికిత్స చేయడం దగ్గరే ఆగిపోకుండా ఆయుర్వేదం సప్తధాతువులనూ, మొత్తం శరీర వ్యవస్థనూ జీవద్వంతంగా, పరిపూరణ చైతన్యవంతంగా మార్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. తాత్కాలిక ఉపశమన చికిత్సల జోలికి వెళ్లకుండా, శాశ్వత చికిత్సలే పరమావధిగా నడుస్తుంది. అందుకే ఒక వ్యక్తి మోకాళ్ల నొప్పుల కోసమే వచ్చినా, మోకాళ్లనొప్పులతో పాటు అతన్ని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న మరెన్నో ఇతర రుగ్మతలు కూడా ఈ ఆయుర్వేద చికిత్సలో నయమవుతాయి. ఎవరికైనా శరీరంలోని అవయవాలన్నీ సఖ్యంగా పనిచేస్తున్నప్పుడు దాని విలువ బోధపడదు. ఆ అవయవాల్లో ఏదో ఒకటి కుంటుపడినప్పుడు ఎంత నష్టపోయామో తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, మోకాళ్ల నొప్పులు వచ్చాయీ అంటే సమస్య మోకాళ్లలో మాత్రమే ఉందని కాదు. మోకాళ్ల నొప్పులకు కారణమైన వాతం మునుముందు మరెన్నో వ్యాధులకు బీజం వేస్తుంది. అందుకే ఆయుర్వేదం అన్ని రోగాలకూ మూలభూతంగా ఉండే వాతాన్ని నియంత్రిస్తుంది. ఆ క్రమంలో త్రిదోషాల్లోని మిగతా రెండు అంటే పిత్తం, కఫం కూడా దారికొస్తా యి. ఈ సమస్థితి మోకాళ్ల బాధలనుంచే కాదు జీవన బాధలనుంచే విముక్తి చేస్తుంది.
Drsrinu

841
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles