మోకాళ్లనొప్పికి ఆయుర్వేద తైలాలు


Sat,July 15, 2017 12:05 AM

చాలా సందర్భాల్లో మోకాళ్ల నొప్పులకు కారణం ఒకటైతే, లభించే వైద్యం ఆ సమస్యకు పెద్దగా సంబంధం లేని మరేదో అయి ఉంటుంది. మోకాళ్ల నొప్పులకు అసలు కారణం సంధివాతం. అదేంటో తెలియకుండా ఎవరెన్ని మందులు ఇస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది?
Janu-Sandhi
శరీరంలోని సమస్త కదలికలకు అవసరమైన వాతం సహజంగానే అందరి శరీరాల్లోనూ ఉంటుంది. అయితే ఈ వాతం ప్రకోపితం అయినప్పుడు అంటే సమస్థితిని కోల్పోయినప్పుడు సంధివాతం (ఆస్టియో ఆర్థరైటిస్) మొదలవుతుంది. దీన్నే వాతం దూషితం కావడం అంటారు. సహజంగా వాతం కఫాన్ని దూషితం చేసినప్పుడే సంధివాతం మొదలవుతుంది. ఈ సమయంలో దూషిత లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో ప్రధానంగా కీళ్లు బిగుసుకుపోవడం, కదిలినప్పుడు శబ్దాలు రావడం, ముట్టుకున్నప్పుడు ఆ భాగం వేడిగా అనిపించడం, ఎరుపుగా మారడం, నిలబడే, కూర్చునే సమయంలో నొప్పి అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో చాలాసేపు కూర్చున్న తరువాత గానీ, పడుకుని లేచినప్పుడు గానీ, వెంటనే లేచి నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కాసేపు నడిచాక బిగుసుకుపోయిన భాగాలు సడలి, నడకలో కొంత సౌకర్యం ఏర్పడుతుంది. సంధివాతంలో ఇది ఒక ముఖ్య లక్షణంగా ఉంటుంది.

ఇతర కారణాలు


మోకాలుకు ఏదైనా అనుకోని కుదుపు లేదా దెబ్బ తగిలినప్పుడు మోకాలి కీలును పట్టి ఉంచే కండరాల పట్టీలలో అంటే లిగమెంట్లలో ఏవైనా తెగిపోవచ్చు. లేదా భాగాల్లో దేనికైనా గాయం కావచ్చు. అలా జరిగినప్పుడు మోకాలును కదల్చలేనంత నొప్పి మొదలవుతుంది. ఆ నొప్పి మోకాలి లోపలి నుంచి ఉండొచ్చు. లేదా మోకాలి బయటి భాగంలో ఉండొచ్చు. ఒకవేళ మోకాలి కీలు మధ్య భాగంలో ఉండే క్రుసియేట్ లిగమెంట్‌కు గాయమైతే మోకాలి లోపలి నుంచి చురుకు చురుకుమనే నొప్పి ఉంటుంది. లోపల ఏదో నొక్కుకుంటున్నట్టుగా కూడా ఉంటుంది. ఇలా మోకాలి లోపలి కండరాల పట్టీల్లో దేనికి గాయమైనా మోకాలి కీలు వాచిపోయి మంట పుడుతున్నట్టుగా ఉంటుంది. వంగినా, నడుస్తున్నా నొప్పి ఇంకా తీవ్రమవుతుంది. కొందరిలో మోకాలి కీలు ఇన్‌ఫెక్షన్లకు గురికావడం వల్ల కూడా నొప్పి రావొచ్చు. మోకాలుకు బలమైన దెబ్బ తగిలి కీలు లోపల రక్తస్రావం అయినప్పుడు కూడా తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఇదేకాకుండా తుంటి నుంచి మోకాలు దాకా వ్యాపించి ఉండే లియోటిబియల్ బాండ్ అనే కండరానికి గాయం కావడం వల్ల కూడా మోకాళ్ల నొప్పి రావొచ్చు.
srinivas

ఆయుర్వేద చికిత్స


ఏ సంధివాతం అంటే కీళ్లనొప్పులు మొదలైనప్పటికీ వాత హర చికిత్సలు చేయడం ద్వారా ఆ సమస్యను తొలగించవచ్చు. అయితే అరిగిపోయిన కార్టిలేజ్ తిరిగి వృద్ధి చేయడం ద్వారా మాత్రమే ఈ సమస్య శాశ్వతంగా తొలిగిపోతుంది. అందుకుగాను ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన ఔషధ యుక్త తైలాలతో చేసే జానువస్తి చికిత్స ఉంటుంది. దీనివల్ల మోకాళ్లలో అరిగిపోయిన భాగాలన్నీ తిరిగి వృద్ధి చెందుతాయి. తైలాల ద్వారా, కొన్ని రకాల మాత్రల ద్వారా అరిగిపోయిన కార్టిలేజ్‌ను తిరిగి ఉద్ధరించే పూర్తి అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి కార్టిలేజ్‌ను పునరుద్ధరించే శక్తి ఆయుర్వేద తైలాలకు మాత్రమే ఉంది. జానువస్తి చికిత్సలు ఎవరైనా చేయవచ్చు. కానీ ఆ సమయంలో కీళ్లలోకి పంపించే తైలం పాత్రే ఇక్కడ కీలకం. ఆ తైలం ఎంతో ప్రత్యేకమైంది. ప్రత్యేక తైలాలు, ఔషధాలతో మోకాళ్ల నొప్పులు సమూలంగా తొలిగిపోతాయి. ఆయుర్వేద వైద్యులు సూచించిన చికిత్సలన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటే మోకాళ్ల నొప్పుల బాధ మాయమవుతుంది.

390
Tags

More News

VIRAL NEWS

Featured Articles