
- మోకాళ్లలో పటుత్వం ఉంటే.. ఎంత దూరమైనా నడవచ్చు.
- కానీ గుజ్జు అరిగిపోతే పట్టుమని పది మెట్లు కూడా ఎక్కలేం.
- ఆపసోపాలు పడుతూ అడుగు తీసి అడుగు వెయ్యలేం.
- ఎన్ని మందులు వాడినా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించదు.
- అయితే.. మోకాలి నొప్పికి శాశ్వత పరిష్కారమేమీ లేదా?
- ఉంది. అదే.. కీలు మార్పిడికి అధునాతనమైన శస్త్ర చికిత్స గోల్డెన్ ఇంప్లాంట్ ఆపరేషన్.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల 60 ఏండ్లకు వచ్చే మోకాళ్ల నొప్పులు 40 ఏండ్లకే వస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో మోకాళ్లనొప్పుల సమస్య తీవ్రంగా ఉంటున్నది.
అవి శాశ్వతం కావు: సర్జరీ అనగానే ఎవరికైనా భయం కలుగుతుంది. చిన్న వయసులోనే సర్జరీ తప్పనిసరి అయినా, ఇంప్లాంట్స్‌తో కూడా ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇంప్లాంట్ నాణ్యత.. సర్జరీ టెక్నిక్.. సర్జన్ నైపుణ్యం మీద ఇది ఆధారపడి ఉంటుంది. మోకాలు కీలు అరుగుదల తీవ్రంగా ఉండి కాళ్లు వంకరలు తిరిగిన సందర్భాల్లో ఇంప్లాంట్ అమరికలో కొన్ని డిగ్రీల వంకరలు ఉండే అవకాశం ఎక్కువ. దీనివల్ల నడకలో తేడా వస్తుంది. త్వరగా అరిగిపోవచ్చు కూడా.
మార్పిడి ఒక్కటే మార్గం: ఇండియాలో 15% మంది మోకాలి కీలు సమస్యలతో బాధపడుతున్నారట. వీరిలో దాదాపు 10% మందికి మందులతోనే ఉపశమనం కలిగే అవకాశం ఉన్నప్పటికీ కీలు మార్పిడి ఆపరేషన్ వైపే ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి మోకాలు కీలు సమస్య పరిష్కారానికి కీలు మార్పిడి చికిత్స తప్ప మరో మార్గం లేదు. అయితే కొన్నిసార్లు ఆపరేషన్లు కూడా వికటిస్తుంటాయి. అసలు సమస్యకు మరో సమస్య తోడై మొదటికే మోసం వస్తుంది. ఈ సమస్యలేవీ లేకుండా మోకాలు కీలును విజయవంతంగా మార్పిడి చేసేందుకు ఉన్న అధునాతన శస్త్ర చికిత్సా విధానం గోల్డెన్ ఇంప్లాంట్ పద్ధతి. ఒక రకంగా ఇది మోకాలు కీలు మార్పిడి చేసుకునేవాళ్లకు వరం.
చికిత్స ఎందుకు?: కీళ్ల సమస్యలు వంద రకాలుగా ఉంటాయి. వీటిలో మోకాలు కీలు మార్పిడి శస్త్ర చికిత్సకు దారితసేది మాత్రం ఆస్టియో ఆర్థరైటిస్. ఇంకోటి రుమటాయిడ్ ఆర్థరైటిస్. వయస్సు పైబడిన కొద్ది కీళ్లు అరిగిపోయి ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఏర్పడితే.. వయసుతో సంబంధం లేకుండా మోకాలు కీలు అరిగిపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. అందుకే మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలి. అయితే ఆపరేషన్ అయినవాళ్లలో 10-15% మంది లోహ సంబంధమైన అలర్జీలు, ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారట. ఈ అలర్జీలు రాకుండా నివారించే అధునాతమైన శస్త్ర చికిత్స విధానం అందుబాటులోకి వచ్చింది. అదే గోల్డెన్ ఇంప్లాంట్ పద్ధతి. శస్త్ర చికిత్స తప్పనిసరి అయితే ఆలస్యం చేయకుండా గోల్డెన్ ఇంప్లాంట్ చేసుకోవడం మంచిది.
ప్రయోజనాలేంటి?: లోహాల అలెర్జీ ఉండడంతో ఇలాంటి వారికోసం నూతనంగా వచ్చిన ఆవిష్కరణే గోల్డెన్ ఇంప్లాంట్. దీర్ఘకాల మన్నిక కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అవసరమైన రోగులకు కూడా గోల్డెన్ ఇంప్లాంట్ ఎంతో ఉపయోగకరం. ఈ మోకాలి ఇంప్లాంట్లు టైటానియం నియోబియం నైట్రేడ్ ఉపరితలపూతను కలిగిఉంటాయి. ఈ పూత ఇంప్లాంట్‌కు బంగారు రంగుల రూపాన్ని ఇస్తుంది. ఈ పూత వల్ల మోకాలి మార్పిడి శస్త్రచికిత్స తరువాత నొప్పుల నుంచి బయటపడి ఎప్పటిలాగే ఉండొచ్చు.

ధరలూ తక్కువే
క్రోమియం కోబాల్ట్ మిశ్రమంతో తయారైన రెగ్యులర్ మోకాలి ఇంప్లాంట్లు శరీరంలోని లోహం అయానులను విడుదల చేయడంతో వాపు ఏర్పడుతుంది. పట్టు కోల్పోవడం, నిరంతర నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. ఈ ఇంప్లాంట్‌ను 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రోగులకు ప్రాధాన్యం ఇస్తారు. కృత్రిమ ఆభరణాలకు అలెర్జీ, మెటాలిక్ వాచ్ పట్టీ లేదా మెటాలిక్ వినోదం ఫ్రేముల అలర్జీతో బాధపడేవారు ఈ చికిత్సను ఆశ్రయించవచ్చు. మెకాలి ఇంప్లాంట్ల ధరలను 59 నుంచి 89 శాతం వరకు తగ్గించింది ప్రభుత్వం. ఈ నిర్ణయం దేశంలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అవసరమైన 3 కోట్ల మందికి ఉపయోగపడనుంది.