మోకాలినొప్పికి చక్కని చికిత్సలు


Tue,June 13, 2017 11:47 PM

మోకాలిలో నొప్పి దాదాపుగా అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. మోకాళ్ళ నొప్పులకు దాదాపుగా 5 కారణాలు ఉంటాయి.

iStock
-స్పోర్ట్స్ వల్ల కలిగే గాయాలు - కొంత మందిలో ఆటలు ఆడుతున్నపుడు కీలులో ఉండే లిగమెంట్‌కు గాయాలై మోకాలిలో నొప్పి వస్తుంది. ఎక్కువగా యువతలో ఇలాంటి నొప్పి వస్తుంది.
-ఆస్టియోఆర్థరైటిస్ - వయసు మళ్లిన వారిలో మోకాలి నొప్పికి ఇది ప్రధాన కారణం. వయసు పెరగడం వల్ల మోకాళ్లు అరిగిపోవడం ఆస్టియోఆర్థరైటిస్‌కు కారణం అవుతుంది.
-రుమటాయిడ్ ఆర్థరైటిస్ - ఇది ఒక దీర్ఘకాలికమైన సమస్య. శరీరంలోని అన్ని కీళ్లు దీని ప్రభావానికి లోనవుతాయి. ముఖ్యంగా కాళ్లు చేతి వేళ్లలో ఉండే కీళ్లు ఎక్కువగా దీని ప్రభావానికి లోనవుతాయి. దీన్ని సరైన సమయంలో గుర్తించి చికిత్స ప్రారంభించాలి. ఇది జన్మంతా వేధించే సమస్య.
-గౌట్ ఆర్థరైటిస్ - శరీరంలో ఎక్కువైన యూరిక్ ఆసిడ్ చిన్న చిన్న క్రిస్టల్స్‌గా మారుతుంది. ఈ క్రిస్టల్స్ క్రమంగా కీళ్లలో చేరుతాయి. ముఖ్యంగా కాలి బొటనవేలు, మోకాలి కీళ్లలో చేరుతాయి. త్వరగా దీన్ని గుర్తించి చికిత్స తీసుకోకపోతే చాలా తీవ్రమైన నొప్పిగా మారుతుంది.

నిర్ధారణ - చికిత్స


-స్పోర్ట్స్ వల్ల కలిగిన గాయాలు - మొదట గాయం ఎపుడు, ఎలా అయ్యిందనేది నిర్ధారించుకోవాలి. అందుకు పేషెంట్‌తో మాట్లాడిన తర్వాత ఎంఆర్‌ఐ అవసరమవుతుందో లేదో నిర్ధారిస్తారు. ఎంఆర్‌ఐ పరీక్ష ద్వారా ఫిజియో థెరపీ సరిపోతుందా, లేక ఇంజక్షన్లు అవసరమవుతాయా? లేదా ఆర్థ్రోస్కోపీ సర్జరీ అవసరమవుతుందా అనేది నిర్ధారణ అవుతుంది.
-ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కలిగే మోకాలి నొప్పి - శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల ఆస్టియో అర్థరైటిస్ సమస్య నడి వయస్కుల్లో ఎక్కువ అవుతోంది. దీన్ని నిర్ధారించడానికి ఎక్స్‌రే పరీక్ష అవసరమవుతుంది. ఎక్స్‌రే ద్వారా సమస్య ఏ స్థాయిలో ఉన్నది తెలుసుకోవచ్చు. మొదటి రెండు దశల్లో కేవలం కొన్ని మందులతో, ఐస్‌ప్యాక్ తో కాపడం పెట్టడం వంటి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ నొప్పిని అదుపులో ఉంచవచ్చు. దీనికి చికిత్స తీసుకోకుండా వదిలేస్తే వేగంగా మూడు, నాలుగు స్థాయిలకు చేరుకుంటుంది.
-మూడోస్థాయిలో గ్లూకోజమైన్ ఇంజక్షన్లు, స్టిరాయిడ్లతో చికిత్స అందిస్తారు. నాలుగోస్థాయిలో కేవలం మోకాలి మార్పిడి మాత్రమే ఉపయుక్తమైన చికిత్స. ఆస్టియోఆర్థరైటిస్‌ను ఎంత త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే అంత మంచిది.
-రుమటాయిడ్ ఆర్థరైటిట్ వల్ల కలిగే నొప్పి - రుమటాయిడ్ ఆర్థరైటిస్ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ మాదిరిగానే దీనిలో కూడా స్థాయిలు ఉంటాయి. ఎంత త్వరగా దీన్ని నిర్ధారించుకుంటే అంత మంచిది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను రక్తపరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడు మందులతో చికిత్స ఇవ్వవచ్చు. చికిత్స త్వరగా ప్రారంభించకపోతే జీవితాంతం చికిత్స తీసుకుంటూనే ఉండాలి.
-పోస్ట్ ట్రామా ఆర్థరైటిస్ వల్ల మోకాలి నొప్పి - ఈ రకమైన సమస్యను ఎక్స్‌రే ద్వారా నిర్ధారిస్తారు. ఆటల్లో అయిన గాయాలకు వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించి చికిత్స ప్రారంభిస్తే మంచిది. చికిత్సను వాయిదా వెయ్యడం వల్ల ఇతర దుష్ప్రభావాలకు దారి తీస్తుంది.
-గౌట్ వల్ల కలిగే మోకాలి నొప్పి - ఈ చికిత్స కూడా సమస్య ఏస్థాయిలో ఉన్నదన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మోకాలి కీలు లేదా కాలి బొటనవేలి కీలులో యూరిక్ ఆసిడ్ క్రిస్టల్స్ పేరుకు పోవడం వల్ల నొప్పి వస్తుంది.
ఇది దీర్ఘకాలికంగా ఉండే నొప్పి. దీన్ని నిర్లక్ష్యం చేసి చికిత్స ఆలస్యంగా ప్రారంభించిన వాళ్లు జీవిత పర్యంతం మందులు వాడాల్సి రావచ్చు. సమస్య ప్రారంభంలోనే చికిత్స ప్రారంభించిన వాళ్లు మందులతో ఈ సమస్యకు పూర్తిగా దూరం కావడం సాధ్యమే. సమస్య తీవ్రమైనపుడు సర్జరీ అవసరమవుతుంది.
krishna

నివారణ


-స్పోర్ట్స్ వల్ల గాయాలు అయిన వారు వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలి.
-ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారు సర్జరీని తప్పించుకోవాలంటే వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలి.
-ఈ పరిస్థితి ఎదురయ్యే ఆస్కారం ఉన్నవారు మాంసం, కందిపప్పు, పాలకూర, కాలీఫ్లవర్ వంటివి తినకూడదు.

1231
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles