మైగ్రేన్‌కు హోమియో


Wed,February 17, 2016 12:30 AM

తలనొప్పి చాలా సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్య. ఒక్కసారైనా తలనొప్పి రాని వారు ఎవరూ ఉండరనడం అతిశయోక్తి కానేకాదు. అయితే తలనొప్పి తరచుగా వస్తుంటే మాత్రం అశ్రద్ధ చెయ్యకూడదు. తలనొప్పికి మరేదైనా పెద్ద ఆరోగ్య సమస్య కారణం కావచ్చు. రక్తపోటు, మెదడులో కణితి, రక్తప్రసరణలో మార్పులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల కూడా తలనొప్పి వస్తుంది. మగవాళ్లలో అయితే సాధారణంగా బీపీ, ఒత్తిడి, మెదడులో కణితుల వల్ల వచ్చే తలనొప్పి ఎక్కువ. మైగ్రేన్ లేదా పార్శపు తలనొప్పి మహిళల్లో ఎక్కువ. ఇది తలకు ఒకవైపు వస్తుంది. వాంతులు కూడా ఉండొచ్చు. తలలో ఉండే రక్తనాళాలు ఒత్తిడికి లోనై వాచిపోవడం వల్ల నొప్పి వస్తుంది.

మైగ్రేన్‌కి కారణాలు


మానసిక ఆందోళన, ఒత్తిడి. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాల గురించి తరచూ ఆందోళనపడడం
-డిప్రెషన్, నిద్రలేమి.
-కొంతమందికి బయటికి వెళ్లినప్పుడు, సూర్యరశ్మి ద్వారా తలనొప్పి వస్తుంది.
-అధికంగా ప్రయాణాలు చేయడం
-స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, నెలసరి ముందు గాని, తరువాత గాని, గర్భధారణ సమయంలో, నెలసరి ఆగిపోయినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది.
-గర్భనిరోధక మాత్రల లాంటి కొన్ని రకాల మందుల వాడకం.

మైగ్రేన్ దశలు - లక్షణాలు


చాలావరకు మైగ్రేన్ దానంతటదే తగ్గిపోతుంది. సాధారణంగా 24 గంటల నుంచి 72 గంటల వరకు పట్టవచ్చు. నొప్పి 72 గంటలుంటే స్టేటస్ మైగ్రేన్ అంటారు.
మైగ్రేన్ నొప్పి 4 దశలుగా ఉంటుంది.
-ప్రొడ్రోమ్ దశ : ఇది నొప్పికి ముందు 2 గంటల నుంచి 2 రోజుల ముందు వరకు జరిగే ప్రక్రియల సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి.
-ఆరా దశ : ఇది నొప్పి మొదలయ్యే కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. చూపు కాస్త మందగించినట్లు కావడం, జిగ్‌జాగ్ లైన్స్ రావడం, తలలో సూదులతో గుచ్చినట్టుండడం, మాటలు తడబడడం, కాళ్లలో నీరసం ఉంటాయి.
-నొప్పి దశ : ఇది 2 గంటల నుంచి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ దశలో వాంతులుంటాయి. చాలావరకు ఒకవైపునే ఉంటుంది. కాంతి, ధ్వనులకు సెన్సిటివ్‌గా ఉంటారు.
-పోస్ట్‌డ్రోమ్ దశ : నొప్పి తగ్గిన తరువాత కొద్దిరోజుల వరకు తల భారంగా ఉండడం, నీరసం, శ్రద్ధ ఉండకపోవడం కనిపిస్తాయి.

వ్యాధి నిర్ధారణ


-సీబీపీ, ఈఎస్‌ఆర్ రక్తపరీక్షలు
-రక్తపోటును గమనించడం
-ఈఈజీ పరీక్ష
-అవసరాన్ని బట్టి మెదడుకు సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్

జాగ్రత్తలు


మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. తలకు నూనెతో మసాజ్ చేసుకుంటే తలలోని నరాలు రిలాక్సవుతాయి.
తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, లైటు తీసేసి, నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి.

హోమియోవైద్యం


మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులున్నాయి. ఘాటైన వాసనలు పీల్చినప్పుడు తలనొప్పి వస్తే బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నీషియా ఇవ్వాలి. తరచూ అధికంగా తలనొప్పి వస్తుంటే నాట్రంమూర్, సాంగ్యునేరియా, చైనా, సెపియా ఇవ్వాలి. గర్భవతులకైతే బెల్లడోనా, నక్స్‌వామికా, సెపియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వల్ల తలనొప్పి వస్తే ఇగ్నీషియా, సెపియా, కాక్యులస్, కాలికార్బ్ ఇవ్వాలి. ఈ మందులు అవగాహనకు మాత్రమే. నిష్ణాతులైన హోమియోవైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వీటిని తీసుకోవాలి.

1884
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles