మేల్కొలుపు


Thu,August 30, 2018 10:56 PM

Melukolupu
తవ సుప్రభాత మరవింద లోచనే
భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృషశైలనాథ దయితే దయానిధే॥
-శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్


ఓ మహాలక్ష్మీ! తామరరేకుల వంటి కన్నులు నీవి. చంద్రబింబమంటి ముఖారవిందం. బ్రహ్మ భార్య సరస్వతీదేవి, మహేశ్వరుని భార్య పార్వతీదేవి, దేవేంద్రుని భార్య పులోమజ (శచీదేవి) వంటి వారితో పూజలందుకొనే తల్లివి. దయార్ద్ర హృదయానికి ప్రతిరూపానివి. వృషభాచలాధిపతి అయిన శ్రీ వేంకటేశుని ఇల్లాలివైన.. నీకిదే మా సుప్రభాతం.

192
Tags

More News

VIRAL NEWS