మెనూలో క్యాలరీలుండాలి!


Thu,May 24, 2018 01:54 AM

రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు నచ్చినవి ఆర్డర్ చేస్తాం. మనం ఎన్ని కేలరీలు తింటున్నామో లెక్క ఉండదు. కానీ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఇప్పుడు మెనూలో క్యాలరీలు కూడా చేర్చమంటున్నది.
junk
ఇంట్లో కాకుండా బయట ఎక్కడ తింటున్నా సరే.. కొన్నిసార్లు ఎంత తిన్నామో తెలియకుండా లాగించేస్తుంటాం. జంక్‌ఫుడ్‌ల కారణంగా స్థూలకాయం, మధుమేహం, అనేక రకాల జబ్బుల బారిన పడుతుంటాం. ఇలా జరుగకూడదని ఎఫ్‌డీఏ భావించింది. దీనికి పరిష్కారం చూపించాలనుకుంది. అందుకే ఇప్పటి నుంచి మహారాష్ట్రలోని ప్రతీ రెస్టారెంట్ మెనూని మార్చాలని ఆదేశం ఇవ్వాలని చూస్తున్నది. దీంట్లో వంటకాలతో పాటు.. ఆ వంటకాలు తినడం వల్ల ఎంతమేర కేలరీలు తీసుకుంటున్నారో కూడా పక్కన రాయాలి. అప్పుడు ఆర్డర్ చేసేవాళ్లు అన్ని కేలరీలు తీసుకుంటున్నామా అనుకొని ఆ ఫుడ్‌ని తినకుండా మానేయడమో లేదా తక్కువ తినడమో చేస్తారు. ఇలా చేయడం వల్ల ఊబకాయానికి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నది ఎఫ్‌డీఏ. ఇప్పటికే చాలామంది తాము తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ చూపుతున్నారు. కానీ తెలియకుండా ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి వారికి సరైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ మోనూ మార్పులు చేయాలని భావిస్తున్నాం అంటున్నది ఎఫ్‌డీఏ. కేవలం రెస్టారెంట్లే కాదు.. ప్యాకింగ్ చేసే ఏ ఫుడ్ పైన అయిన క్యాలరీలు లెక్క కట్టాల్సిందేనంటున్నారు. ఇప్పటికి ఇది ప్రపోజల్ దశలోనే ఉంది. కానీ ఎక్స్‌పర్ట్స్ మాత్రం ఇలా జరిగితే మంచి మార్పు అని కొనియాడుతున్నారు.

1350
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles