మెదడు సమస్యలకు స్వర్ణామృతప్రాశన


Tue,March 15, 2016 11:15 PM

ఆటిజం, ఎడిహెచ్‌డి(అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివ్ డిజార్డర్), ఎడిడి (అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్)... లాంటివన్నీ నాడీవ్యవస్థకు అంటే మెదడుకు సంబంధించిన వ్యాధులు. శారీరక వ్యాధులకు చికిత్స చేయడంలోనే ఆధునిక వైద్యవిధానాలు నానా అగచాట్లు పడుతున్నాయి. ఇక మెదడు వ్యాధుల విషయంలో అయితే పూర్తి నిస్సహాయతనే వ్యక్తం చేస్తున్నాయి. ఏవో బిహేవియర్ థెరపీలతో సరిపెడుతున్నాయి. కాని ఆయుర్వేదం మాత్రం 5 వేల సంవత్సరాల క్రితమే ఈ వ్యాధులన్నిటికీ చికిత్స చేయడానికి ఉత్సాహంగా అడుగులు వేసింది. ఈ క్రమంలో రూపొందిన ఔషధమే స్వర్ణమృతప్రాశన. కొంతమంది పిల్లలు రెండేళ్లు గడిచినా ఒక్క జంట పదాన్నయినా స్పష్టంగా మాట్లాడలేరు. నడకలోనూ ఏదో లోపం కనిపిస్తూ ఉంటుంది. చదువు, ఆటల్లోనూ వెనుకబడుతారు. చాలామందికి ఇవి ఆటిజం వ్యాధి లక్షణాలని తెలియదు.

ఏమవుతుంది?


ఆటిజమ్‌కి గురైన పిల్లలు శారీరకంగానూ, మానసికంగానూ బలహీనంగా ఉంటారు. ఈ వ్యాధిలో కేంద్రనాడీ వ్యవస్థ, పెరిఫెరల్ నాడీ వ్యవస్థ రెండింటి మధ్య సమన్వయం ఉండదు. దీనివల్ల పిల్లల ఆలోచనల్లో విస్తృతి ఉండదు. విచక్షణ ఉండదు. మాటల్లో స్పష్టత ఉండదు. ఆలోచన, చర్యలకు మధ్య అంతర సంబంధం ఉండదు. ఐక్యూ, గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి చాలా తక్కువ. కొందరిలో హైపర్ లక్షణం కూడా ఉండొచ్చు. కండరాలు బిగుసుకుపోయివుండడం వల్ల కొంతమందికి నడవడం కూడా సరిగా రాదు.

ఎడిహెచ్‌డి


దీనివల్ల అనాలోచిన స్పందన (ఇంపల్సివిటీ) నిర్లగ్నత (అటెన్షన్‌లెస్) వల్ల దేనిమీదా మనసు లగ్నం చేయలేకపోవడం, అతి స్పందన (హైపర్‌యాక్టివిటీ) అంటే విచక్షణ లేకుండా అతిగా ప్రవర్తించడం ఈ మూడు లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ఎడిడి (అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్) అనే వ్యాధిలో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఏదీ గమనించకుండా వీధుల్లో పరుగులు తీయడం, తోటి పిల్లలను అకారణంగా కొట్టడం, క్లాసుల్లో అసంబద్ధంగా అరవడం వంటివి చేస్తుంటారు. కావలిసిన దానికోసం క్షణం కూడా నిరీక్షించలేరు. ఏదీ మనసుపెట్టి వినరు, పనిచేయరు.

నాడీవ్యవస్థ లోపాలు


ఆటిజం గానీ, ఎడిహెచ్‌డి గాని మౌలికంగా నాడీవ్యవస్థలో ఏర్పడిన స్తబ్దత వల్ల సంక్రమించే వ్యాధులు. కేంద్రనాడీ వ్యవస్థకూ, శరీర ఇతర భాగాల్లోని నాడీవ్యవస్థకూ మధ్య సఖ్యమైన బంధమేదీ లేకపోవడం వల్ల వచ్చే ఈ వ్యాధుల్లో జన్యుపరమైన లోపాలు ప్రధానంగా ఉంటాయి. క్రోమోజోమ్‌లలోని అపసవ్య స్థితి కూడా ఇందుకు కారణమే. గర్భంతో ఉన్న స్త్రీలపై కాలుష్య ప్రభావం వల్ల కూడా ఈ సమస్య రావొచ్చు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో కూడా ఇది కనిపిస్తుంది. తల్లిదండ్రుల్లో ధూమపానం, మద్యపానం అలవాట్లు, గర్భంతో ఉన్నప్పుడు తల్లి విపరీతమైన మానసిక ఒత్తిళ్లకు గురవడం కూడా ఈ వ్యాధికి దారితీయవచ్చు. పిత్త, కఫ దోషాలు కూడా కారణం కావొచ్చు.

స్వర్ణామృతప్రాశన


దీనిలో స్వర్ణభస్మం ప్రధానంగా ఉంటుంది. ఇది మూడు నాలుగు వారాల్లోనే శరీరం మీద అద్భుతమైన ప్రభావం చూపుతుంది. ఈ భస్మానికి శరీర కణజాలంలోని అత్యంత సూకా్ష్మంశాల్లోకి వెళ్లగలిగే అసమానమైన శక్తి ఉంటుంది. అందుకే ఇతర ఔషధాల్లా ఆరు నెలలు, ఏడాది కాకుండా కేవలం 20 రోజులకే ఈ ఔషధ ప్రభావం కనిపిస్తుంది. ఆటిజమ్‌లో కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ మధ్య గల అనుసంధానాన్ని పునరుద్ధరిస్తుంది. స్వర్ణామృత ప్రాశనను పుట్టిన వెంటనే తల్లిపాలకన్నా ముందే ఒక డోసు ఇస్తే ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్వర్ణామృతప్రాశనలో స్వర్ణభస్మంతో పాటు మేధస్సును శక్తివంతం చేసే మేధోద్రవ్యాలు కూడా ఉంటాయి. వీటితో పాటు నెయ్యి, తేనెలకు కూడా ఇందులో సమాన భూమిక ఉంది. ఇవి స్వర్ణామృత ప్రాశనలోని ఔషధ గుణాల్ని అత్యంత వేగంగా శరీరంలోని కణకణానికీ చేరవేసే వాహికలుగా పనిచేస్తాయి. దీనివల్ల వ్యాధినిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. స్వర్ణామృత ప్రాశన ముందుగా ఆటిజమ్, ఎడిహెచ్‌డి వ్యాధులు పెరిగే వేగాన్ని తగ్గిస్తుంది. ఆ తరువాత వ్యాధి మూలాల మీద పనిచేస్తూ, ఈ వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది.

డాక్టర్ పూజారి రవికుమార్
ఆర్‌కె ఆయుర్వేదిక్ అండ్
సొరియాసిస్ సెంటర్
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్
9849254587
040-23057483

2332
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles