మూత్ర పిండాల్లో రాళ్లకు ఇక సెలవు


Wed,April 13, 2016 12:49 AM

KidneyStonesమూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడం అనేది ఈ మధ్యకాలంలో చాలాఎక్కువగా జరుగుతోంది. మన దేశంలో పురుషుల్లో 10.6 శాతం మందిలో, స్త్రీలలో 7.1 శాతం మందిలో ఈ సమస్యతో భాధపడుతున్నారు. దీనికి మారిన జీవన శైలి ప్రపంచ అధునీకరణ, మారిన ఆహారపు అలవాట్లు, స్థూలకాయం వంటివి ప్రధాన కారణంగా భావించవచ్చు. ఇది మన శరీరం ఒక భారీ కర్మాగారం. ఇందులో నిరంతరం రకరకాల జీవక్రియాలు జరిగిపోతూనే ఉంటాయి. వీటిని బయటకు పండిచండంలో మూడు అవయవాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం ఈ మూడు ముఖ్యమైన విసర్జక అవయవాలు. మళ్లీ వీటిలో కూడా 90 శాతం మలినాలను విసర్జించేవి మూత్రపిండాలే. మూత్రపిండాలు రక్తంలోని విషపదార్ధాలను అదనంగా ఉన్న నీటిని క్రమంగా తొలగిస్తుంటాయి. మన కిడ్నీలు ప్రతిరోజు 200 లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి.
నేటి ఉరుకు పరుగుల జీవితాల్లో చాలా మంది సరిపడా నీళ్లు కూడా తాగలేకపోతున్నారు. ఫలితంగా ఈ కిడ్నీ రాళ్లతో సతమతమయ్యే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. చాలా సందర్భాల్లో ఈ రాళ్లు చాలా చిన్నవిగా ఉంటూ మూత్రంలో విసర్జితమవుతాయి. కొన్ని సందర్భాల్లో రాళ్లు పరిమాణం పెద్దగా ఉండటం వల్ల మూత్రనాళాల్లో చిక్కుకుని తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.

కారణాలు
స్థూలకాయం, ద్రవపదార్థాలు తీసుకోకపోవడం
మూత్రవయవాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్
నీరు తగినంత తాగకపోవడం
జన్యుపరమైన ఇన్‌ఫెక్షన్లు
ఎక్కువగా వేడి వాతవరణంలో ఉండడం
వంశపారంపర్యం
కొన్ని రకాల మందులు

లక్షణాలు
పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి
నీరసం, వికారం, తీవ్రమైన జ్వరం
మూత్రంలో రక్తం పడడం
విపరీతమైన చమటలు, బరువు తగ్గడం
మూత్రంలో మంట రావడం
మూత్రంలో చీము రావడాఇ్న పైయూరియా అంటారు

జాగ్రత్తలు
నీటిని ఎక్కువగా తాగాలి. నీరు గానీ ఇతర ద్రవపదార్థాలు కాని మొత్తంగా కలిపితే రోజుకు 4 లీటర్లకు తగ్గకుండా తీసుకోవాలి
కిడ్నీలో అప్పటికి ఆక్సలేట్ రాళ్లు ఉంటే, ఆక్సలేట్ ఉండే పదార్థాలు అంటే చాక్‌లేట్, పాలకూర, సోయా, ఎండు చిక్కుడు ధాన్యల్లాంటివి తీసుకోకూడదు.
కాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి అవి శరీరానికి అందేలా ఆహార నియమాలను పాటించడం వంటివి
కూల్ డ్రింకులను అస్సలు తాగకూడదు.

నిర్ధారణ పరీక్షలు
కిడ్నీ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కాన్, కిడ్నీ పరీక్ష
రక్త పరీక్ష, మూత్రపరీక్ష

హోమియో చికిత్స
హోమియోపతిలో శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా కిడ్నీ రాళ్లు పరిమాణం, అవి ఏవైపున ఏర్పడ్డాయో వాటి ఆధారంగా మంచి మంపదుల అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బేరిబేరి వాల్గారిస్, సరసపరిల్ల, కాల్కేరియాకార్బ్ వంటి మందులు మంచి ఫలితాలనిస్తాయి.
murali

1910
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles